"టీ" తాగడం మానేస్తే రక్తపోటు నుంచి విముక్తి కలుగుతుందా..?   

షేర్ చేయండి:
"టీ" తాగడం మానేస్తే రక్తపోటు నుంచి విముక్తి కలుగుతుందా..?   

సాక్షి లైఫ్ : భారతదేశంలోని ప్రతి నలుగురిలో ముగ్గురు టీ ప్రేమికులు ఉంటారు. ఉదయం మొదలైన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, టీ లేకుండా ఉండలేరు కొందరు. టీ తాగడం అనే అలవాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందా..? హాని చేస్తుందా..? అసలు టీ తాగడంవల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా..? అయితే మీరు ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

సోషల్ మీడియాలో సైతం ఎక్కడ చూసినా టీ వల్ల కలిగే దుష్ప్రభావాలు, లాభనష్టాల గురించే మాట్లాడుతున్నారు కానీ, వీటన్నింటిలో తరచుగా వచ్చే ప్రశ్న ఏమిటంటే మనం టీ తాగడం మానేసినా అది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? మీరు ఒక నెల పాటు టీకి దూరంగా ఉంటే ఏమి జరుగుతుంది..?
 
టీ తాగిన తర్వాత, కొన్ని క్షణాల్లోనే అలసిపోయిన మీ శరీరంలో ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. చాలా మందికి ఇదే భావన కలుగుతుంది. అయితే ఇలా వచ్చే తక్షణ శక్తి భవిష్యత్తులో అనేక వ్యాధులకు దారితీస్తుందని మీకు తెలుసా? నిజానికి, టీలో ఉండే కెఫిన్ మీ రక్తపోటును పెంచుతుంది. దానిని నిరంతరం తీసుకోవడం ద్వారా, మీరు అధిక రక్తపోటు వంటి సమస్యలకు గురవ్వొచ్చు.

అటువంటి పరిస్థితిలో, మీరు ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే, మీరు ఖచ్చితంగా మొదటి రోజుల్లో కొద్దిగా నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది. కానీ రక్తపోటును నియంత్రించడంలో మీరు చాలా ప్రయోజనం పొందగలుగుతారు.

ఇది కూడా చదవండి..పీఎం నరేంద్ర మోడీ ఆరోగ్య రహస్యాలు.. 

ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.