ఫ్యాటి లివర్‌ను నిర్లక్ష్యం చేయకండి.. !
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా గుండె వ్యాధులు, మధుమేహం తర్వాత వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యగా ఫ్యాటి లివర్ మారుతోంది. ఈ సమస్యకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ రెండవ గురువారం గ్లోబల్ ఫ్యాటి లివర్ డే (Global Fatty Liver Day)గా పాటిస్తున్నారు.
ఫ్యాటి లివర్ అంటే ఏమిటి?
లివర్‌లో కొవ్వు పదార్థాలు అతి మోతాదులో పేరుకుపోవడం వల్ల కలిగే పరిస్థితినే ఫ్యాటి లివర్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది.
ఆల్కహాలిక్ ఫ్యాటి లివర్ (మద్యం వాడకానికి సంబంధించి)
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటి లివర్ (ఆహారం, జీవనశైలి కారణంగా వచ్చే పరిస్థితి)
"ఫ్యాటి లివర్ మొదట్లో ఎటువంటి లక్షణాలను చూపదు. కానీ దీర్ఘకాలంగా ఈ సమస్య ఉండే లివర్ ఇన్‌ఫ్లమేషన్, సిరోసిస్, గుండెపోటు వంటి ప్రమాదకర స్థితులకూ దారితీస్తుంది" అని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ కావ్య తెలిపారు. ఫ్యాటీలివర్ కు సంబంధించిన మరిన్ని విశేషాలు ఆమె సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మానసిక ప్రశాంతతనిచ్చే సంగీతం..
ఇది కూడా చదవండి..పిల్లల్లో ఏకాగ్రతను పెంచే యోగాసనాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
