Prevent Thalassemia : తలసేమియాను తరిమికొట్టాలంటే.. ముందస్తు పరీక్షలే ముఖ్యం..!

షేర్ చేయండి:
Prevent Thalassemia : తలసేమియాను తరిమికొట్టాలంటే.. ముందస్తు పరీక్షలే ముఖ్యం..!

సాక్షి లైఫ్ : జన్యుపరంగా సంక్రమించే తలసేమియా వ్యాధిని సరైన అవగాహన, ముందస్తు పరీక్షలతో పూర్తిగా నివారించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నగరంలో నిర్వహించిన తలసేమియా సదస్సులో నిపుణులు మాట్లాడుతూ.. మన దేశంలో ఏటా సుమారు 15వేల మంది పిల్లలు ఈ వ్యాధితో జన్మించడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

 

నివారణ మార్గాలు ఇవే..

తొలి త్రైమాసికంలో పరీక్ష.. గర్భిణులు మొదటి మూడు నెలల్లోనే కేవలం రూ. 100 ఖర్చుతో కూడిన 'HbA2' పరీక్ష చేయించుకోవడం ద్వారా ముప్పును గుర్తించవచ్చు. అవసరమైతే దంపతులిద్దరూ పరీక్షలు చేయించుకుని, జన్యు సలహాలు తీసుకోవాలి.

 దేశంలోనే తొలిసారిగా మహబూబ్‌నగర్ ఆదర్శం.. 

 దేశంలోనే తొలిసారిగా గర్భిణులందరికీ 100శాతం స్క్రీనింగ్ నిర్వహించి, తలసేమియా రహిత జిల్లాగా మహబూబ్‌నగర్ రికార్డు సృష్టించిందని వైద్యులు కొనియాడారు. తలసేమియా బాధితులకు ఉచిత రక్త మార్పిడి, మందులు అందిస్తూ 'హైదరాబాద్ తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ' (TSCS) అండగా నిలుస్తోంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే 2035 నాటికి దేశాన్ని తలసేమియా రహితంగా మార్చవచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.