Eating Eggs Daily : రోజూ గుడ్డు తింటే.. రెండు వారాల్లోనే అనేక ప్రయోజనాలు.. 

షేర్ చేయండి:
Eating Eggs Daily : రోజూ గుడ్డు తింటే.. రెండు వారాల్లోనే అనేక ప్రయోజనాలు.. 

సాక్షి లైఫ్ : మనం తీసుకునే ఆహారంలో 'సంపూర్ణ పోషకాహారం' ఏది అంటే ఠక్కున గుర్తొచ్చేది కోడిగుడ్డు. అయితే గుడ్డులోని పచ్చసొన (Yolk) వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది దానిని పక్కన పెడుతుంటారు. కానీ, ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల కేవలం రెండు వారాల్లోనే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని ఎయిమ్స్ (AIIMS), హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి వెల్లడించారు. ఆయన వివరించిన ముఖ్యమైన ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

1. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.. 

గుడ్డులో 'కోలిన్' (Choline) అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడులో సమాచారాన్ని చేరవేసే 'ఎసిటైల్కోలిన్' అనే న్యూరోట్రాన్స్‌మిటర్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా, ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది.

2. 'మంచి' కొలెస్ట్రాల్ వృద్ధి..  

చాలామంది గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడతారు. కానీ, క్రమం తప్పకుండా గుడ్డు తీసుకోవడం వల్ల శరీరంలో HDL (మంచి కొలెస్ట్రాల్) స్థాయిలు పెరుగుతాయని డాక్టర్ సేథి పేర్కొన్నారు. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

3. కంటి ఆరోగ్యానికి రక్షణ..  

గుడ్డు పచ్చసొనలో లూటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి డిజిటల్ స్క్రీన్‌ల నుండి వచ్చే హానికరమైన బ్లూ లైట్‌ను ఫిల్టర్ చేసి, కంటి చూపు దెబ్బతినకుండా కాపాడతాయి.

4. మెరిసే చర్మం.. దృఢమైన జుట్టు.. 

గుడ్డులో సల్ఫర్ కలిగిన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో 'కెరాటిన్' అనే ప్రోటీన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. ఫలితంగా జుట్టు రాలడం తగ్గి, గోళ్లు, చర్మం ఆరోగ్యంగా మారుతాయి. ఏదైనా ఆహార నియమాలు పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం మంచిది.

శాకాహారులకు ప్రత్యామ్నాయం..

గుడ్లు తినని వారు వాటికి సమానమైన ప్రోటీన్ పొందడానికి సోయా ఉత్పత్తులు టోఫు, టెంపే, ఎడమామ్ తీసుకోవచ్చని డాక్టర్ సేథి సూచించారు.

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.