Fast Food Calorie Chart : ఫాస్ట్ ఫుడ్ తీసుకునే ముందు ఒకసారి క్యాలరీస్ గమనించండి..!
సాక్షి లైఫ్ : ఫాస్ట్ ఫుడ్‌లో రుచి ఎక్కువ ఉన్నప్పటికీ, వాటిలో కొవ్వు (Fat), సోడియం (Sodium), క్యాలరీలు (Calories) అధికంగా ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడానికి మీరు తీసుకునే ఆహారంలోని క్యాలరీల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫాస్ట్ ఫుడ్ విషయంలో రుచి మరింతగా పెరగడానికి వాటిని తయారు చేసేవాళ్ళు రకరకాల ఇన్ గ్రీడియంట్స్ మిక్స్ చేస్తుంటారు.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
వాటి కారణంగా ఆయా ఆహారపదార్థాలలో ఉండే కేలరీల సంఖ్య మారుతూ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ లోభాగంగా ఉన్న పలురకాల ఐటమ్స్ కు సంబంధించి వాటి పరిమాణాన్ని బట్టి ఎందులో ఎన్ని కేలరీలు ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కొన్ని సాధారణ ఫాస్ట్ ఫుడ్లలో ఉండే సుమారు క్యాలరీలవివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఫాస్ట్ ఫుడ్ క్యాలరీ చార్ట్..
| ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ | పరిమాణం | క్యాలరీలు |
| పొటాటో చిప్స్ | 100 గ్రాములు | 536 |
| సమోసా | 100గ్రాములు (ఒకటి) | 250-300 |
| పకోడీ | 4 నుంచి 5 ముక్కలు | 200 -250 |
| పావ్ భాజీ | 200 గ్రాములు | 390 |
| వెజ్ కట్లెట్ | 100 గ్రాములు (ఒకటి) | 140 |
| చాక్లెట్ కేక్ | 100 గ్రాములు | 360 |
| నార్మల్ సైజ్ వడ | ఒకటి (నార్మల్ సైజ్) | 155 |
| వెజిటేబుల్ బర్గర్ | ఒకటి (నార్మల్ సైజ్) | 130 |
| సాదా కేక్ | 50 గ్రాములు | 150-200 |
| రిగ్యులర్ సైజ్ పిజ్జా | 107 గ్రాములు | 285 |
| స్పాంజ్ కేక్ | 100 గ్రాములు | 297 |
| పేస్ట్రీ | 65 గ్రాములు | 185 |
| గ్రిల్డ్ శాండివిచ్ | ఒకటి (నార్మల్ సైజ్) | 400 |
గమనిక : ఇక్కడ అందించిన కేలరీలు కొన్నిరకాల ఇన్ గ్రీడియంట్స్ తో తయారైనవి మాత్రమే.. ఇవి కాకుండా అధనంగా ఇన్ గ్రీడియంట్స్ కలిపి తయారు చేసిన పదార్థాల కేలరీల సంఖ్యలో కొంత తేడాలు ఉండవచ్చు. కాబట్టి గమనించగలరు.
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
