Fiber : ఫైబర్‌ 'అతి'గా తీసుకుంటే.. ఆరోగ్యానికి ప్రమాదమే.. 

షేర్ చేయండి:
Fiber : ఫైబర్‌ 'అతి'గా తీసుకుంటే.. ఆరోగ్యానికి ప్రమాదమే.. 

సాక్షి లైఫ్ : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పీచుపదార్థం (ఫైబర్) అధికంగా తీసుకుంటే మాత్రం అది ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, ఫైబర్‌ను మోతాదుకు మించి తీసుకుంటే అది పేగులకు శత్రువుగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మలబద్ధకం (Constipation): ఫైబర్ ఎక్కువ తీసుకోవడంవల్ల అది జీర్ణవ్యవస్థలో నీటిని ఎక్కువగా గ్రహిస్తుంది.

ఇది కూడా చదవండి..స్టెమ్ సెల్స్ తో నలుపు రంగును ఎలా తిరిగి తీసుకురావచ్చు..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

ఓవర్ డోస్ కారణంగా.. 

మలబద్ధకం (Constipation): ఫైబర్ ఎక్కువ తీసుకోవడంవల్ల అది జీర్ణవ్యవస్థలో నీటిని ఎక్కువగా గ్రహిస్తుంది. దీనికి తోడు ఒకవేళ తగినంత నీరు తాగకపోతే, మలం గట్టిపడి, తీవ్రమైన మలబద్ధకానికి దారితీస్తుంది. తద్వారా కడుపు ఉబ్బరం, నొప్పి వంటివి తలెత్తుతాయి. గ్యాస్, ఉబ్బరం (Gas and Bloating): అధిక ఫైబర్‌తో కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

నివారణ ఎలా..?  

ఫైబర్‌ను ఒక్కసారిగా కాకుండా, నెమ్మదిగా, క్రమంగా ఆహారంలో పెంచాలని, తప్పకుండా ఎక్కువగా నీరు తాగాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అతి సర్వత్రా వర్జయేత్! అంటే.. అతి అనేది ఏ విషయంలోనూ కరెక్ట్ కాదు. ముఖ్యంగా తిండి విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తుంది. అంటే, ఏదైనా సరే పరిమితికి మించి ఉండకూడదు, మితంగా ఉండాలని, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం మొదలైనవి మంచివి కావు అని ఈ సూక్తి వివరిస్తుంది.

 

ఇది కూడా చదవండి..స్టెమ్ సెల్స్ పరిశోధనలో సంచలనం! : జుట్టు నెరియడానికి అసలు కారణం ఇదేనట..

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.