కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే..? పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటివాటిలో ముఖ్యమైనవి.. స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, తగినంత నిద్రపోవడం, సూర్యకాంతిలో సన్ గ్లాసెస్ ధరించడం, పని సమయంలో ప్రతి 20 నిమిషాలకు కళ్లకు విశ్రాంతి ఇవ్వడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరిచే పోషకాహారాన్నిరోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.. 

క్యారెట్:  ఇందులో బీటా కెరోటిన్ , విటమిన్ ఎ ఉన్నాయి, ఇది కంటి రెటీనాను బలోపేతం చేస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి క్యారెట్లను మీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. బచ్చలికూర: లూటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. బచ్చలికూర కంటి కణాలను దెబ్బతినకుండా కాపాడటంతోపాటు దృష్టిని సంరక్షిస్తుంది. బచ్చలికూర శరీరంలోని ఇతర భాగాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  

చిలగడదుంప: ఇది బీటా కెరోటిన్ కు మంచి మూలం. ఇది వృద్ధాప్య సమస్యల నుంచి కళ్ళను కాపాడుతుంది. కాబట్టి చిలగడదుంపను  ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.టొమాటో: ఇందులో లైకోపీన్ , విటమిన్ సి ఉన్నాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

 

ఇది కూడా చదవండి..కంటి చూపును మెరుగుపరచడానికి ఏమేం చేయకూడదు..?

ఇది కూడా చదవండి..విటమిన్ డి లోపాన్ని నివారించడానికి చిట్కాలు..

ఇది కూడా చదవండి..విటమిన్ డి లోపం వల్ల మానసిక సమస్యలు వస్తాయా..?

ఇది కూడా చదవండి..రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య స్త్రీలకే ఎందుకు వస్తుంది..?

 

క్యాప్సికమ్ :  ఇందులో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. ఇది కంటి కండరాలను బలోపేతం చేస్తుంది. అంతేకాదు కంటి అలసటను తగ్గిస్తుంది. అరటిపండు: పొటాషియం, విటమిన్ ఎ సమృద్ధిగా ఉన్న అరటి కళ్లను హైడ్రేట్ గా ఉంచుతుంది.  దృష్టిని మెరుగుపరుస్తుంది. దీని వల్ల కంటి అలసట, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి.

బ్లూబెర్రీ: ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించి, దృష్టిని మెరుగుపరుస్తాయి. జామకాయ:  విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. జామ కంటి చూపును సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్రకోలీ: లుటీన్ , జియాక్సంతిన్ వంటివి ఇందులో ఉన్నాయి, ఇవి కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ప్రధానంగా కంటిశుక్లం నివారించడంలో సహాయపడతాయి. ఆరెంజ్- విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆరెంజ్ కంటి నరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపును కాపాడుతుంది.

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..తెలంగాణలో మయోనైజ్ నిషేధం.. కారణం ఇదే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.