రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య స్త్రీలకే ఎందుకు వస్తుంది..?
సాక్షి లైఫ్ : రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏ వయసులోనైనా సంభవించే కీళ్లకు సంబంధించిన సమస్య. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. సకాలంలో చికిత్స పొందినట్లయితే, దాని ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఈ వ్యాధికి సంబంధించి ముందుగా కనిపించే కొన్నిరకాల లక్షణాలను విస్మరిస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ కారణాలు,లక్షణాలు..?
రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య అంటే ఏమిటి..?
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్లకు సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఈ వ్యాధి విషయంలో శరీరంలోని సొంత రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. దీని వల్ల రోగాలతో పోరాడే శరీర సామర్థ్యం తగ్గిపోయి అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తోంది.
ఆర్థరైటిస్ అనేది వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్య అయితే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏ వయసులోనైనా రావచ్చు, దాని లక్షణాలను ఎంత త్వరగా గుర్తించి చికిత్స చేస్తే అంత మంచిదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. పురుషుల కంటే మహిళలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. 15 నుంచి 45 సంవత్సరాల మధ్య పునరుత్పత్తి వయస్సులో ఇది ఎక్కువగా సంభవిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లపై మాత్రమే కాకుండా, చర్మం, కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలపై కూడా ఈ సమస్య ప్రభావం కనిపిస్తుంది. నడవడంలో ఇబ్బందితో పాటు ఎముకలు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది.
ఈ కారణాల వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రమాదం పెరుగుతుంది..
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలు ఉన్నాయి. అవేంటంటే..?
మహిళలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే హార్మోన్ల మార్పులు కూడా ఈ వ్యాధికి కారణమ వుతాయి. దీని కారణంగా ఇది మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
ధూమపానం: అధిక సిగరెట్లు , ఆల్కహాల్ తీసుకోవడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కూడా కారణమవుతుంది. ఇది సకాలంలో నియంత్రించకపోతే, పరిస్థితి తీవ్రమవుతుంది. వ్యాధిని నయం చేయడం చాలా కష్టం.
ఊబకాయం: నిరంతరంగా బరువు పెరగడం కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ప్రధాన కారణం. అందువల్ల బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బరువు పెరగడం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు కూడా వస్తాయి.
జన్యుసంబంధం: కొంతమంది వ్యక్తులు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రమాదాన్ని పెంచే నిర్దిష్ట జన్యువులను కలిగి ఉంటారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు..
- చేతి కీళ్లలో, ముఖ్యంగా వేళ్లలో నొప్పి, వాపు.
- పాదాల కీళ్లు, చీలమండలు, మోకాళ్లలో నొప్పి
- జ్వరం
- ఎముకల బలహీనత..
-నీరసం..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
