విటమిన్ డి లోపాన్ని నివారించడానికి చిట్కాలు..
సాక్షి లైఫ్ : విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.. అటువంటివాటిలో సూర్యకాంతి చాలా ప్రధానమైంది. సూర్యకాంతి విటమిన్ డికి ఉత్తమ మూలం. రోజూ కొంత సేపు ఎండలో కూర్చోవడం ద్వారా తగినంత విటమిన్ డి పొందవచ్చు. అయితే, ఉదయం 10 గంటలలోపు మాత్రమే సూర్యకాంతి శరీరానికి తగిలేలా ఉండాలి. ఉదయం పది గంటలు దాటిన తరువాత, సూర్యునిలో హానికరమైన యూవీ కిరణాలు పెరుగుతాయి. అవి శరీరానికి చాలా ప్రమాద కరం కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వీటి ద్వారా డి విటమిన్ పొందవచ్చు..
విటమిన్ "డి" కొన్ని ఆహార పదార్థాలలో కనిపిస్తుంది, అవి: చేప, గుడ్డు పచ్చసొన, పాలు, పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు, బలవర్థకమైన ఆహార పదార్థాలు, తృణధాన్యాలు..
సప్లిమెంట్స్: మీరు మీ ఆహారం నుంచి తగినంత విటమిన్ డి పొందలేకపోతే, వైద్యుని సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలి.
విటమిన్ డి లోపాన్ని నివారించడానికి చిట్కాలు..
సూర్యకాంతిలో ఎక్కువ సమయం గడపండి - ప్రతిరోజూ ఉదయం కొంత సమయం పాటు ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి- మీ ఆహారంలో చేపలు, గుడ్లు, పాలు, ఇతర విటమిన్ డి అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చుకోండి.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?
ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?
ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..?
ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?
వైద్యుడిని సంప్రదించండి: మీకు విటమిన్ డి లోపం ఉన్నట్లు అనిపిస్తే, వైద్యుడిని సంప్రదించండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి - క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, ఒత్తిడిని తగ్గించుకోండి. తగినంత నిద్ర చాలా అవసరం.
ఇది కూడా చదవండి..ఏ వైపు నిద్రించడం ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి..ఈ ఎనిమిది టిప్స్ పాటిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు..
ఇది కూడా చదవండి..మెనోపాజ్ కారణంగా మహిళల్లో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు..
ఇది కూడా చదవండి..ఆస్టియోపోరోసిస్ ను ఎలా నివారించవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
