సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలన్నా, మంచి నిద్ర పట్టాలన్నా రాత్రిపూట కొన్ని రకాల ఆహారాలను తీసుకోకపోవడం మంచిది. లేట్ నైట్ తినే ఆహారం జీర్ణక్రియపై ప్రభావం చూపి, సరిగా నిద్ర పట్టకుండా చేస్తుంది. మంచి నిద్ర కోసం, పడుకోవడానికి కనీసం 2-3 గంటల ముందు భోజనం చేయడం మంచిది. ఒకవేళ ఆకలిగా ఉంటే, తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ చక్కెర ఉన్న తేలికపాటి స్నాక్స్ (ఉదాహరణకు, నట్స్ లేదా పండ్లు) తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..ఎలాంటి ఆహారం ద్వారా ఆయుష్షు ను పెంచుకోవచ్చు..
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే
పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ప్రతిరోజూ ఉదయం ఎనిమిది లేదంటే తొమ్మిది గంటలకు టిఫిన్, మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు భోజనంచేయ్యాలి. రాత్రి పూట ఆరు, ఏడు గంటల సమయంలోపు భోజనం తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు వెల్లడిస్తున్నారు.
క్యాలరీలు తీసుకున్నా..
ఈ సమయాలలో ఎన్ని క్యాలరీలు తీసుకున్నా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వేళా పాళ లేకుండా ఆహారం తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. లేట్ నైట్ లో ఎటువంటి ఆహారం తీసుకోకూడదంటే..?
అల్పాహారం..
ఉదయం అల్పాహారం ఎక్కువగా తినాలి, రాత్రి భోజనం తక్కువగా తీసుకోవాలట. రాత్రి వేళల్లో నాన్ వెజ్ తీసుకోవడం వల్ల కొత్త సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. మాంసాహారంలో ఎక్కువ ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఉండటం వల్ల రాత్రి సమయంలో అరగడం కష్టం అవుతుంది.
శారీరక శ్రమ..
అంతేకాదు శారీరక శ్రమ ఉండదు కాబట్టి రాత్రి సమయంలో మాంసాహార పదార్థాలు అతి తక్కువగా తినడం లేదా పూర్తిగా మానేయడం మరీ మంచిది. భోజనం తర్వాత తీపి పదార్థాలు తినడం కొంతమందికి అలవాటు. అయితే రాత్రి సమయంలో స్వీట్స్ తినడం వల్ల శరీరంలోని బ్లడ్ ప్రెజర్ లెవల్స్ పెరుగుతాయి. కనుక లేట్ నైట్ లో స్వీట్స్ తీసుకోకపోవడమే బెటర్ అంటున్నారు డాక్టర్లు.
అనారోగ్య సమస్యలు..
ఫ్రూట్స్ హెల్త్ కు చాలా మంచిది. కాకపొతే లేట్ నైట్ లో తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. పండ్లను రాత్రి సమయంలో తీసుకోకూడదు. చాలా రకాల పండ్లలోను, జ్యూస్ ల లోనూ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
ఆరంజ్, ద్రాక్ష, పైనాపిల్..
వీటిని తీసుకోవడం వల్ల గాస్ట్రిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. ఆరంజ్, ద్రాక్ష, పైనాపిల్ వంటి ఫ్రూట్స్ ను రాత్రివేళల్లో తీసుకోకపోవడమే మేలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇటువంటి పండ్లు కేవలం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యనే తెనాలి. ఆ సమయంలో తినడం వల్ల ఈజీగా జీర్ణం అవుతాయి. అలా అని పండ్లను ఖాళీ కడుపుతో కూడా తినకూడదు.
జీర్ణ సంబంధిత సమస్యలు..
ఎందుకంటే దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అదేవిధంగా లేట్ నైట్ లో పిజ్జా అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే స్పైసీస్, టమోటో సాస్, చీజ్ వంటివి ఇందులో ఉన్నాయి కాబట్టి. ఇవి జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. కనుక పిజ్జా, బర్గర్లు వంటివి నైట్ టైమ్ అవాయిడ్ చేయడమే మంచిదని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
నిద్ర లేమి సమస్యలు..
ఆకలి వేసిన సమయానికి ఆహారం తీసుకోవాలి. లేకుంటే అజీర్తి, రక్తహీనత, పోషకాహార లోపం, గుండెల్లో మంట, కడుపు నొప్పి, బరువు, కండరాలు, ఎముకలు, నిద్ర లేమి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. ఇదే విషయం పలు రకాల పరిశోధనల్లో తేలింది.
సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆయుష్షు కూడా తగ్గుతుంది. అంతేకాదు దీర్ఘకాలిక రోగాల బారీన పడాల్సి వస్తుంది. భోజనం చేసిన తర్వాత కనీసం 4 నుంచి5 గంటల వ్యవధి ఖచ్చితంగా ఉండాలి. రాత్రి సమయంలో తినే ఆహారంలో తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com