సాక్షి లైఫ్ : హెడ్ ఫోన్స్, ఈయర్ బడ్స్ ఎక్కువ సమయం వాడడం వల్ల వినికిడి సమస్యలు తలెత్తుతున్నాయి. 2050 నాటికి దాదాపు 250 కోట్ల మంది వినికిడి సమస్యల బారీన పడే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు 70కోట్ల మందికి వినికిడి లోపాలకు చికిత్స అవసరమవు తుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కంటే వంద కోట్ల కుపైగా యువకులు శాశ్వతంగా చెవిటివారిగా మారే ప్రమాదం ఉందని పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. మతిమరుపునకు చికిత్స సాధ్యమేనా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. అసలు ఫోన్ లేకుండా గడవడం చాలా కష్టమవుతోంది. అంతగా స్మార్ట్ ఫోన్ అవసరం ఏర్పడింది. ఏదైనా వస్తువు వాడేటప్పుడు ఆరోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం విషయంలో అలా జరగడంలేదు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా కళ్ళ సమస్యలు, వినికిడి సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కారణాలు ఏమిటి..?
ముఖ్యంగా వినికిడి సమస్యలు గతంలో కేవలం వృద్ధాప్యంలో మాత్రమే తలెత్తేవి.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యలు యువకులలో కూడా వేగంగా పెరుగుతోంది. జీవనశైలి అలవాట్లే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఇయర్‌ఫోన్‌లను అతిగా వాడడం వల్ల చెవి సంబంధిత వ్యాధులతోపాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు, వినికిడి సమస్యలు రాకుండా ఉండాలంటే..? సరైన పోషకాహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
కొందరు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడానికి ఇష్టపడతారు. ప్రయాణంలో ఉన్నప్పుడు, ఇంట్లో పని చేస్తున్నప్పుడు లేదా ఆఫీసులో పని చేస్తున్నప్పుడు కూడా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఎక్కువసేపు పాటలు వింటున్నారు. ఎక్కువ సమయం వినడం వల్ల కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
చెవి ఇన్ఫెక్షన్ కారణంగా కొందరిలో చెవి క్యాన్సర్ కూడా వచ్చేప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. చెవి ఇన్ఫెక్షన్ ఉన్న వారు వాడిన అదే హెడ్‌ఫోన్ లేదా ఇయర్‌ఫోన్‌లను మరొకరు ఉపయోగిస్తే, వాళ్లు కూడా ఆ ఇన్‌ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటివి నివారించడానికి, హెడ్‌ఫోన్‌లను తక్కువగా ఉపయోగించండి. ముఖ్యంగా ఇతరుల ఇయర్‌ఫోన్‌లను అస్సలు వాడొద్దు. అంతే కాదు, ఇయర్‌ఫోన్‌ల ద్వారా ఎక్కువ సౌండ్ వినడం వల్ల చెవుల్లోని నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం..
ఎక్కువ సేపు హెడ్ ఫోన్స్ వాడటం వల్ల వినికిడి సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుందని ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి మీరు హెడ్‌ఫోన్‌లను ఉపయోగించినప్పుడు, కొంత సమయం విరామం తీసుకోండి. ఎక్కువ సేపు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటే తలలోని నరాలపై ఒత్తిడి పడుతుంది. తద్వారా వినికిడి శక్తి తగ్గుతుంది. అంతే కాదు ఇయర్‌ఫోన్‌ల రేడియేషన్, అయస్కాంత ప్రభావం కారంణంగా తలనొప్పి సమస్య మొదలవుతుంది.
ఇయర్‌ఫోన్..
ఇయర్‌ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల చెవుల్లోకి గాలి ప్రవహించే అవకాశం ఉండదు. దీనివల్ల చెవి ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి. ఇన్ఫెక్షన్ కారణంగా ఒక్కోసారి శాశ్వతంగా వినికిడి శక్తిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
సౌండ్ తో వినడం వల్ల..
ఇయర్‌ఫోన్‌లను ఎక్కువ సౌండ్ తో వినడం వల్ల గుండెపై ప్రభావం పడుతుంది.. అంతే కాకుండా అనేక రకాల మానసిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
వయస్సు పెరిగేకొద్దీ..
వాస్తవానికి, సాధారణ వ్యక్తి వినికిడి సామర్థ్యం 90 డెసిబుల్స్ వరకు ఉంటుంది. కానీ ఇయర్ ఫోన్లలో అది 40 నుంచి 50 డెసిబుల్స్ పాటలు వింటున్నప్పుడు లేదా ఇయర్‌ఫోన్‌లు ఉపయోగిస్తున్నప్పుడు ఇది గమనించలేము. కానీ తరువాత వయస్సు పెరిగేకొద్దీ, దాని దుష్ప్రభావాలు వినికిడి శక్తి మీద కనిపిస్తాయి.
వినికిడి లోపాన్ని నిర్ధారించడానికి పరీక్షలు..
శారీరక పరీక్ష: డాక్టర్లు వినికిడి సమస్యకు లేదా ఇన్ఫెక్షన్ కారణాలను తెలుసుకోవడానికి చెవిలో చూస్తారు.
జనరల్ స్క్రీనింగ్ టెస్టులు: వైద్యుడు చెవిలో వివిధ వాల్యూమ్‌లలో మాట్లాడే పదాలను ఎంత బాగా వింటున్నారో..? ఇతర శబ్దాలకు బాధితులు ఎలా స్పందిస్తారో తనిఖీ చేస్తారు.
ట్యూనింగ్ ఫోర్క్ టెస్టులు: ట్యూనింగ్ ఫోర్క్‌లు రెండు చెవుల వద్ద మెటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంచి, వాటి ద్వారా వచ్చిన శబ్దాలను గుర్తించ గలుగుతున్నారా..? లేదా అనేది పరీక్షిస్తారు డాక్టర్లు . ప్రామాణికమైన ఫోర్క్‌లతో కూడిన పరీక్షలు వినికిడి లోపాన్ని గుర్తించడంలో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com