క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించే 'నాలుగు పదార్థాల' షాట్.. 

సాక్షి లైఫ్ : ప్రస్తుత జీవనశైలిలో వ్యాధుల నుంచి రక్షణ పొందడం కీలకం. ముఖ్యంగా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి పోషకాహార నిపుణులు (Nutritionist) చాలా సులభమైన, శక్తివంతమైన నాలుగు పదార్థాల 'షాట్' గురించి వెల్లడించారు. ఇది నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో మంట (Inflammation) ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గుతాయని వారు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

ఆరోగ్య రక్షక షాట్‌లోని ఆ నాలుగు అద్భుతమైన పదార్థాలు ఇవే..  

పచ్చి పసుపు (Raw Turmeric)..  పసుపులో ఉండే కర్కుమిన్ అనే ప్రధాన సమ్మేళనం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించి, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది.

ఉసిరికాయ (Amla).. విటమిన్-సి అనేది ఉసిరిలో పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity),కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరకణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

అల్లం (Ginger).. అల్లంలో ఉండే 'జింజెరోల్' అనే సమ్మేళనం తీవ్రమైన వాపు (Chronic Inflammation)ను తగ్గిస్తుంది. ఇది క్యాన్సర్ వ్యాప్తిని అడ్డుకోవడంలో కూడా సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

నల్ల మిరియాలు (Black Pepper).. మిరియాలలో ఉండే పైపెరిన్ అనే పదార్థం.. పసుపులోని కర్కుమిన్‌ను శరీరం గ్రహించేలా చేస్తుంది.  కాబట్టి మిరియాలతోపాటు పసుపు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. 

ఈ షాట్‌ను తయారుచేసుకోవాలి అంటే..? 

సగం అంగుళం పచ్చి పసుపు, ఒక ఉసిరికాయ, ఒక అంగుళం అల్లం ముక్క, రెండు నల్ల మిరియాల గింజలను కొద్దిగా నీటితో కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని వడకట్టి, పరగడుపున తాగడం ఉత్తమం. ఈ పానీయం వైద్య చికిత్సకు లేదా క్యాన్సర్‌కు నివారణకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడానికి ముందు డాక్టర్‌ను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : blood-cancer ginger skin-cancer turmeric-powder prostate-cancer cancer-factors cancer-cases cancer cancer-risk immunity inflammation how-to-reduce-inflammation-in-the-body health-benefits-of-peppers turmeric immunity-boosting-foods vitamins-to-boost-immunity what-diet-is-best-for-inflammation amla-benefits benefits-of-amla chronic-inflammation
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com