ఎలాంటి కూరగాయలను పచ్చిగా తినకూడదు ఎందుకు..?
సాక్షి లైఫ్ : కొన్నిరకాల కూరగాయలను పచ్చిగా తినకూడదు, ఎందుకంటే వాటిలో సహజంగా కొన్ని హానికరమైన పదార్థాలు లేదా జీర్ణక్రియకు ఇబ్బంది (digestive problems)కలిగించే కారకాలు ఉండే ప్రమాదం ఉంది. వాటిని ఉడికించడం కారణంగా ఆయా ప్రమాదాలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు( fruits and vegetables) ఎక్కువగా తీసుకోవాలి అనేది అందరికీ తెలిసిందే.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు( fruits and vegetables) ఎక్కువగా తీసుకోవాలి అనేది అందరికీ తెలిసిందే. అయితే పాచి కూరగాయలు, పండ్లు తినేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని వైదులు చెబుతున్నారు. కొన్నిరకాల కూరగాయలు(vegetables) ఉడికించి తింటారు, మరికొన్ని పచ్చిగా తింటారు. అలంటి వాటిలో పచ్చిగా తినకూడని కూరగాయలున్నాయి. అవి తింటే ఆరోగ్యానికి హానికరమని డాక్టర్లు వెల్లడిస్తున్నారు
కూరగాయలను ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల వాటిలో ఉండే పోషకాలు పోతాయని మనం తరచుగా వింటుంటాం. ఇది మాత్రమే కాదు, కూరగాయలు, పండ్లను ఎలాంటి ప్రాసెసింగ్ లేదా వంట లేకుండా తినడం వల్ల అదనపు శక్తి లభిస్తుందని అంటారు.
అంతేకాదు అవి తింటే చర్మ సంరక్షణ , మంచి జీర్ణశక్తి, గుండె ఆరోగ్యంగా ఉండడమేకాకుండా, క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని కొందరు నమ్ముతారు. అయితే పొరపాటున కూడా పచ్చిగా తినకూడని కొన్ని కూరగాయలు ఉన్నాయని కూడా తెలుసుకోవాలి.
పచ్చి కూరగాయలు తినడం వల్ల శరీరం పరాన్నజీవులు( parasites), బ్యాక్టీరియా(bacteria), విషపూరిత పదార్థాలకు(toxic substances) గురవుతుంది, ఇది ఆరోగ్యానికి చాలా హానికరం(harmful to health). అలాంటి కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తినకూడనివి..?
క్యాబేజీ (Cabbage)..
క్యాబేజీ(Cabbage)లో కొన్ని రకాల పురుగులు నివసిస్తూ అందులో గుడ్లను పెడతాయట. ఇవి కంటికి కనిపించవు, కానీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఆ పురుగులను చంపడానికి కొన్ని పురుగుమందులను పిచికారీ చేసినప్పుడు కూడా కొన్ని క్యాబేజీ (Cabbage)లోపల బతికే ఉంటాయి. కాబట్టి మీ క్యాబేజీని తినడానికి ముందు శుభ్రం చేసి, ముక్కలుగా కట్ చేసి వేడి నీటిలో ఉడికించాలి.
-క్యాప్సికమ్ (Capsicum)..
క్యాప్సికమ్(Capsicum) ను ఉపయోగించే ముందు, వాటి గింజలను తీసివేసి, వాటిని వేడి నీటిలో కడగాలి, ఎందుకంటే లోపల బద్దెపురుగులు గుడ్లు పెడతాయి. బతికే ఉంటాయి. కాబట్టి క్యాప్సికమ్ ను ఉడికించకుండా తినలేము.
-వంకాయ(brinjal)..
వంకాయ(brinjal)లో బద్దెపురుగులు ఎక్కువగా ఉంటాయి. కొన్నిటిలో మనకు సహజంగానే పుచ్చు కనిపిస్తుంది. బద్దెపురుగులు రక్తప్రవాహంలోకి ప్రవేశించగలవు. కాబట్టి దీనిని నివారించడానికి వంకాయలను పూర్తిగా ఉడికించడం ఉత్తమ మార్గం.
-చామకూర ఆకులు(Colocasia Leaves)..
చామకూర ఆకులను (Colocasia Leaves)ఆహారం కోసం ఉపయోగించే ముందు తప్పకుండా ఉడకబెట్టాలి. అదే నియమం బచ్చలికూర, పాల కూరకి వర్తిస్తుంది. అధిక ఆక్సలేట్ స్థాయిలు కలిగి ఉన్నందున వాటిని వేడి నీటిలో ఉడికించాలని అలా ఉడికిస్తే ఆక్సలేట్ లెవల్స్ తగ్గుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
