మినరల్ వాటర్ పై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రకటన..
సాక్షి లైఫ్ : ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) మినరల్ వాటర్ గురించి కీలక ప్రకటన చేసింది. ప్రతిరోజూ మనం తాగే మినరల్ వాటర్ లేదా బాటిల్ వాటర్ ఆరోగ్యానికి చాలా హానికరమని, ఇది హై రిస్క్ ప్రొడక్ట్స్ కేటగిరీలో చేర్చినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. ఈ మేరకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఓ నివేదికను విడుదల చేసింది. ఇకపై కంపెనీలు వార్షిక తనిఖీలు చేయాల్సి ఉంటుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ తెలిపింది.
ఇది కూడా చదవండి..ముల్లంగి ఆకుల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయంటే..?
ఇది కూడా చదవండి..మనం తినే ఆహారం ఆరోగ్య పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
ఇది కూడా చదవండి..శీతాకాలంలో ముల్లంగి ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
హై రిస్క్ ప్రొడక్ట్స్ కేటగిరిలో మినరల్ వాటర్..
మనం ఎప్పుడు బయటికి వెళ్లినా లేదా రెస్టారెంట్‌కి వెళ్లినా, తరచుగా బాటిల్ వాటర్ లేదా మినరల్ వాటర్ వాడుతుంటాము. ఇది చాలా స్వచ్ఛమైనదని భావిస్తాము. కానీ దీనికి సంబంధించి ఓ పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మినరల్ వాటర్ పేరుతో విక్రయించే బాటిల్ వాటర్‌ను హై రిస్క్ ఫుడ్ కేటగిరీలో ఉంచింది. అంటే మినరల్ వాటర్ పేరుతో అమ్ముతున్న నీరు మన ఆరోగ్యానికి చాలా హానికరమని తేల్చింది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ నివేదికలో..
ఎఫ్ఎస్ఎస్ఏఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మార్కెట్లో అమ్ముడవుతున్న అనేక ఉత్పత్తులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ధృవీకరణకు అనుగుణంగా లేవు. 'ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ , మినరల్ వాటర్' కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాల పరిధిలోకి రావు. ఈ కారణంగా ఇది 'హై రిస్క్ ఫుడ్ కేటగిరీ'లో చేర్చారు. మినరల్ వాటర్ తనిఖీ థర్డ్ పార్టీ ఆడిట్ పరిమితులకు లోబడి ఉంటుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. అంతేకాకుండా, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌కు సంబంధించి విధానాలను మార్చినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తన నివేదికలో పేర్కొంది.
ప్రతి సంవత్సరం తనిఖీ చేయాల్సిందే..
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నివేదిక తర్వాత ప్యాకేజ్డ్, మినరల్ వాటర్ తయారీదారులు ఇప్పుడు ప్రతి సంవత్సరం జరిగే రిస్క్ బేస్ తనిఖీ చేయించుకోవాలి. బిఐఎస్ ధృవీకరణ కోసం ఆహార ఉత్పత్తుల విషయంలో లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కోసం ప్రతి సంవత్సరం తనిఖీ చేయవలసి ఉంటుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్..
అంతేకాదు హై రిస్క్ ఫుడ్ కేటగిరీలలో ఉంచిన ఉత్పత్తులను ప్రతి సంవత్సరం ఆడిట్ చేయవలసి ఉంటుంది. ఇది థర్డ్ పార్టీ ఆడిటింగ్ ఏజెన్సీ ద్వారా చేస్తారు. వాస్తవానికి, ఉత్పత్తుల నాణ్యతను కొలవడానికి ,మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. తాగునీటి పరిశ్రమ నిబంధనలను మార్చాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రభుత్వాన్ని కోరింది. తాగునీటి పరిశ్రమ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ,ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి గురింపు పొందవలసి ఉంది.
ఇది కూడా చదవండి..బరువు తగ్గడానికి అడపా దడపా ఉపవాసం ఆరోగ్యకరమైనదేనా..?
ఇది కూడా చదవండి..వెరికోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం ఏమిటి..?
ఇది కూడా చదవండి..శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే నువ్వులు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
