సాక్షి లైఫ్ : చలికాలంలో నువ్వులు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శక్తి, పుష్టిని పెంచడంలో ఇవి సహాయపడతాయి. అలాగే, వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తాయి. నువ్వులు గుండె ఆరోగ్యం కాపాడడంలోనూ, సుగర్ లెవల్స్ ని నియంత్రించడంలో జలుబు లేదా దగ్గు వంటి సీజనల్ సమస్యల నివారణలో కూడా నువ్వులు ఎంతగానో మేలుచేస్తాయి.
నువ్వులలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియంతోపాటు ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే..?
ఇది కూడా చదవండి..మధుమేహం నియంత్రణలో ఉండకపోవడానికి ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..40 సంవత్సరాలు దాటిన తర్వాత పురుషులలో వచ్చే అనారోగ్య సమస్యలు..
ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ తగ్గాలంటే వీటిని అస్సలు తినకండి..
పీచు పుష్కలంగా ఉండే నువ్వులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు నువ్వులు చాలా మంచిది. నువ్వులు తింటే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. వీటిలోని 'ఒలియిక్ యాసిడ్' , 'లినోలిక్ యాసిడ్' వంటివి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో..
నువ్వులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నువ్వులలో ఉండే అధిక కాల్షియం దీనికి తోడ్పడుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులతో పోరాడేందుకు నువ్వులను తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నువ్వులు మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కూడా చాలా మేలు చేస్తాయి. నువ్వులలోని పీచు అరుగుదలకు తోడ్పడుతుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి నువ్వులు దివ్యౌషధంగా పనిచేస్తాయి.
మెదడు పనితీరులో..
నువ్వులు మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నువ్వులలో ఉండే అనేక పోషకాలు దీనికి ఉపయోగపడుతాయి. ముఖ్యంగా నువ్వుల్లో ఉండే విటమిన్ బి6 మెదడుకు మేలు చేస్తుంది. నువ్వులు మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, చర్మ వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. నువ్వులలోని విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు సహకరిస్తాయి.
ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..? ఇది ఎంత ఉంటే నార్మల్..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని నివారించాలంటే ఎంత సమయం నడవాలి..?
ఇది కూడా చదవండి..ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..బ్లాక్ కాఫీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com