గ్లోబల్ హెల్త్ అలర్ట్ : యాంటీబయోటిక్ రెసిస్టెన్స్‌తో పోరాడేందుకు నూతన ఆవిష్కరణలు..
సాక్షి లైఫ్ : యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ (ఏఎం ఆర్) ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆరోగ్యానికి పెను సవాలుగా మారినప్పటికీ, ఈ సమస్యను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు నూతన ఆవిష్కరణలతో ముందడుగు వేస్తున్నారు. ఈ రంగంలో జరుగుతున్న సానుకూల పరిణామాలు పిల్లల జీవన రక్షణకు కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..బ్రౌన్ రైస్ ఆరోగ్యకరమైనవి కాదా..? తాజా అధ్యయనాలు ఏమంటున్నాయంటే..?
ఇది కూడా చదవండి..పుచ్చకాయ గింజలతో ఆరు అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..Kids health : పిల్లల్లో డెంగ్యూ ఫీవర్ ఎందుకు ప్రాణాంతకం..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) గణాంకాల ప్రకారం, 2022లో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కారణంగా సుమారు 30 లక్షల మంది పిల్లలు ఇన్ఫెక్షన్లతో మరణించారు. కానీ, ఈ సమస్యను అరికట్టేందుకు అనేక దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. భారతదేశంలోని ఫార్మా కంపెనీలు కూడా కొత్త యాంటీబయోటిక్స్ అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ఇటీవల ముంబైకి చెందిన వాక్‌హార్ట్ సంస్థ ‘నాఫిత్రోమైసిన్’ అనే ఔషధాన్ని తయారు చేసింది, ఇది రెసిస్టెన్స్‌తో కూడిన న్యుమోనియాకు వ్యతిరేకంగా గట్టి పోరాటం చేస్తుంది.
అంతేకాదు, బెంగళూరుకు చెందిన బగ్‌వర్క్స్ రీసెర్చ్ సంస్థ, గ్లోబల్ యాంటీబయోటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్ (జీఏఆర్ డిపి)తో కలిసి, తీవ్రమైన రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా కొత్త రకం యాంటీబయోటిక్స్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఔషధాలు ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్నాయి. త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యాంటీబయోటిక్స్ దుర్వినియోగాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. భారతదేశంలో కూడా యాంటీబయోటిక్స్‌ను డాక్టర్ సలహా లేకుండా విక్రయించడాన్ని నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అలాగే, శుద్ధమైన నీరు, పారిశుద్ధ్యం, టీకాల ద్వారా ఇన్ఫెక్షన్లను నివారించే కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి.
నిపుణులు ఏమంటున్నారంటే, ప్రజలు యాంటీబయోటిక్స్‌ను జాగ్రత్తగా వాడటం, వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవడం వల్ల ఈ సమస్యను చాలావరకు నియంత్రించవచ్చు. అంతేకాదు, పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే ఆరోగ్యకరమైన ఆహారం, సకాలంలో టీకాలు అందించడం వంటి చర్యలు వారిని రక్షించడంలో కీలకం.
కాబట్టి, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్‌తో పోరాడేందుకు ప్రపంచదేశాలు ఏకమై కృషి చేస్తున్నాయి. కొత్త ఔషధాలు, మెరుగైన వైద్య విధానాలు, పలు అవగాహన కార్యక్రమాలతో పిల్ల ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చని వైద్యనిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
