బ్రౌన్ రైస్ ఆరోగ్యకరమైనవి కాదా..? తాజా అధ్యయనాలు ఏమంటున్నాయంటే..? 

షేర్ చేయండి:
బ్రౌన్ రైస్ ఆరోగ్యకరమైనవి కాదా..? తాజా అధ్యయనాలు ఏమంటున్నాయంటే..? 

సాక్షి లైఫ్ : చాలామంది బ్రౌన్ రైస్‌ను వైట్ రైస్ కంటే ఆరోగ్యకరమని భావిస్తుంటారు. కానీ, దీనికి సంబంధించిన తాజా అధ్యయనాలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి. అమెరికాలో విక్రయించే బ్రౌన్ రైస్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే ఆర్సెనిక్ అనే రసాయనం అధిక మోతాదులో ఉన్నట్లు తేలింది. 

 

ఇది కూడా చదవండి.. ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

పరిశోధకులు అనేక బ్రాండ్ల బ్రౌన్ రైస్ నమూనాలను పరీక్షించగా, వీటిలో ఆర్సెనిక్ స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయని గుర్తించారు. దీనికి కారణం, బ్రౌన్ రైస్‌ను పాలిష్ చేయకుండా తీసుకోడం. దీని వల్ల ఆర్సెనిక్  రసాయనం ఎక్కువగా నిల్వ ఉంటుందట. అదే, వైట్ రైస్‌లో ఆర్సెనిక్ స్థాయిలు చాలా తక్కువగా కనిపించాయట, ఎందుకంటే వీటిని పాలిష్ చేసే ప్రక్రియలో ఆర్సెనిక్ తొలగిపోతుంది.

నిపుణులు ఏమంటున్నారంటే..? 

బ్రౌన్ రైస్ తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ వాటిని వీలైనంత తక్కువ మోతాదులో, నాణ్యత ధృవీకరించిన బ్రాండ్ల నుంచి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. అలాగే, రైస్‌ను వండే ముందు బాగా కడగడం, ఎక్కువ నీటిలో ఉడికించి ఆ నీటిని వంచడం వల్ల ఆర్సెనిక్ స్థాయిలను తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కాబట్టి, ఆరోగ్యం కోసం బ్రౌన్ రైస్ ఎంచుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. నాణ్యత, సురక్షిత పద్ధతులతో వండిన ఆహారమే మన ఆరోగ్యానికి మంచిదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..వరల్డ్ హోమియోపతి డే -2025 : అపోహ : హోమియోపతి మందులు ఆలస్యంగా పనిచేస్తాయా..?

ఇది కూడా చదవండి..ఎండాకాలంలో డీహైడ్రేషన్‌ ను తగ్గించే 5 సమ్మర్ డ్రింక్స్‌..

ఇది కూడా చదవండి..High cholesterol : అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రించే 5 కూరగాయలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.