Gulkand: వేసవి తాపాన్ని తగ్గించే దివ్యౌషధం 'గుల్కంద్'..
సాక్షి లైఫ్ : బయట అడుగుపెడితే చాలు ఎండ సెగలు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగుతుంటారు. అయితే, ఇది తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి బదులుగా ఆయుర్వేదంలో అద్భుతమైన 'శీతలీకరణ టానిక్'గా పేరుగాంచిన 'గుల్కంద్' తీసుకోవడం వల్ల శరీరం లోపలి నుంచి చల్లబడటమే కాకుండా అనేక జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఆరోగ్య సిరి.. గుల్కంద్..!
వేసవిలో సాధారణంగా కనిపించే గ్యాస్, ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలకు గుల్కంద్ రామబాణంగా పనిచేస్తుంది. అజీర్తిని తొలగించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.ఎండల వల్ల వచ్చే నోటి పూతలు, ముక్కు నుండి రక్తం కారడం వంటి సమస్యలను అరికడుతుంది. తీవ్రమైన అలసట నుంచి ఉపశమనం కలిగించి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
మార్కెట్లో దొరికే వాటికంటే ఇంట్లోనే స్వచ్ఛంగా, తక్కువ ఖర్చుతో గుల్కంద్‌ను తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు..?
తాజా గులాబీ రేకులు: 250 గ్రాములు
పటిక బెల్లం (పొడి): 250 గ్రాములు
సోంపు పొడి: 1 టీస్పూన్
యాలకుల పొడి: అర టీస్పూన్
గాజు సీసా: ఒకటి
తయారీ విధానం..?
ముందుగా గులాబీ రేకులను శుభ్రంగా కడిగి, తేమ లేకుండా ఒక కాటన్ వస్త్రంపై ఆరబెట్టాలి. ఒక గిన్నెలో ఆరిన రేకులను తీసుకుని అందులో పటిక బెల్లం పొడి, సోంపు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిగా ఉన్న గాజు సీసాలో నింపి మూత గట్టిగా పెట్టాలి. ఈ సీసాను సుమారు 10 నుంచి 15 రోజుల పాటు నేరుగా ఎండ తగిలే చోట ఉంచాలి. రెండు రోజులకోసారి శుభ్రమైన చెంచాతో కలపాలి. రెండు వారాల తర్వాత పటిక బెల్లం కరిగి, గులాబీ రేకులు మెత్తబడి పాకంలో ఊరుతాయి. అంతే.. తియ్యని గుల్కంద్ సిద్ధం..!
ఎలా తీసుకోవాలి అంటే..?
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు ఒక టీస్పూన్ గుల్కంద్‌ను గ్లాసు పాలతో కానీ, మంచి నీటితో కానీ తీసుకోవచ్చు. ఇది పిల్లలు, పెద్దలు అందరికీ ఎంతో మేలు చేస్తుంది. మీరు మధుమేహంతో (Diabetes) బాధపడుతున్నట్లయితే, దీనిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
