Gut Health: డైజెస్టివ్ ఫిట్‌నెస్ కోసం ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి..?
సాక్షి లైఫ్ : గుండె, ఊపిరితిత్తులు, కాలేయం.. ఇలా ప్రధాన అవయవాల ఆరోగ్యంపై చూపే శ్రద్ధ మనం 'జీర్ణాశయం'పై చూపుతున్నామా? అంటే సమాధానం 'లేదు' అనే వస్తుంది. కానీ, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన మొత్తం ఆరోగ్యానికి జీర్ణాశయమే పునాది. కేవలం ఆహారం అరగడమే కాకుండా, పోషకాల శోషణ, రోగనిరోధక శక్తి పెంపు, హార్మోన్ల సమతుల్యత వంటి కీలక ప్రక్రియలన్నీ ఇక్కడే జరుగుతాయి. అందుకే జీర్ణాశయం సరిగ్గా లేకపోతే అది కేవలం కడుపుకే పరిమితం కాకుండా చర్మం, మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది.
సమస్య ఉందని తెలిపే సంకేతాలివే..!
మీ జీర్ణాశయం (Gut Health) అనారోగ్యంగా ఉందని చెప్పడానికి శరీరం కొన్ని హెచ్చరికలను పంపుతుంది. తరచుగా కడుపు ఉబ్బరం (Bloating), మలబద్ధకం, విరేచనాలు, గ్యాస్.
చర్మ మార్పులు ముఖ్యంగా ముఖంపై మొటిమలు, దద్దుర్లు, చర్మ అలర్జీలు. రోజంతా విపరీతమైన అలసట, నిద్రలేమి. ఆందోళన, చిరాకు (Mood Swings), ఏకాగ్రత తగ్గడం. అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం.
ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
లోపల ఏం జరుగుతుందో చెప్పే పరీక్షలు..
మీ ప్రేగుల్లో లక్షలాది మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య యుద్ధం జరుగుతుంటుంది. అక్కడ అసమతుల్యత ఏర్పడితే వైద్యులు ఈ క్రింది పరీక్షలను సిఫార్సు చేస్తున్నారు.
ఫేకల్ కాల్ప్రొటెక్టిన్ టెస్ట్ (మల పరీక్ష)..
ప్రేగుల్లో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ (Inflammation) ఉందా లేదా..? అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష కీలకం. మలంలోని కాల్ప్రొటెక్టిన్ ప్రొటీన్ స్థాయిలను బట్టి ప్రేగుల ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు.
సీలియాక్ వ్యాధి పరీక్ష (tTg-IgA)..
కొందరికి గోధుమలు లేదా గ్లూటెన్ ఉన్న ఆహారం తింటే పడదు. అలాంటి సీలియాక్ వ్యాధిని గుర్తించడానికి రక్తంలో tTg-IgA స్థాయిలను కొలుస్తారు. కడుపు నొప్పి, వాంతులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది అవసరం.
హెచ్. పైలోరీ శ్వాస పరీక్ష (H. pylori Breath Test)..
కడుపులో అల్సర్లకు కారణమయ్యే 'హెలికోబాక్టర్ పైలోరీ' బ్యాక్టీరియా ఉందో లేదో కేవలం శ్వాస పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.
ప్యాంక్రియాటిక్ ఎలాస్టేస్ పరీక్ష..
మనం తిన్న ఆహారం సరిగ్గా అరగడానికి 'క్లోమం' (Pancreas) నుంచి ఎంజైమ్‌లు విడుదలవుతాయి. మలంలో 'ఎలాస్టేస్-1' ఎంజైమ్ స్థాయిని బట్టి జీర్ణక్రియ ఎంత సమర్థవంతంగా సాగుతుందో గుర్తిస్తారు. జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పీచు పదార్థాలు (Fiber), పెరుగు వంటి ప్రోబయోటిక్ ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అతిగా తీపి పదార్థాలు తినడం, ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. ఆయా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా గ్యాస్ట్రోఎంటరాల జిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం. ప్రేగులు ఆరోగ్యంగా ఉంటేనే.. శరీరం దృఢంగా ఉంటుంది..!
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
