Dental Health: ఎలాంటి అలవాట్లు దంతాల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి..?
సాక్షి లైఫ్ : దంతాలు అరిగిపోవడం అనేది వయస్సుతో పాటు వచ్చే సహజ ప్రక్రియ అని చాలామంది భావిస్తారు. కానీ, మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు దంతాల పైఉండే పొర 'ఎనామెల్' (enamel)ను శాశ్వతంగా దెబ్బతీస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. జిమ్‌లో కసరత్తులు చేసేటప్పుడు పళ్లు గట్టిగా బిగబట్టే అలవాటున్న వారి దంతాలు గరుకుగా మారి, సున్నితత్వం (Sensitivity) పెరుగుతుంది. మరోవైపు, రోజుకు మూడుసార్లు అతిగా బ్రష్ చేసే వారికికూడా చిగుళ్ల వద్ద దంతాలు అరిగిపోయి చిన్నపాటి గుంటలు పాడుతాయని, తద్వారా దంతక్షయం (Tooth Wear) బారిన పడేఅవకాశం ఉందని వైద్యనిపుణులు గుర్తించారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
దంత క్షయం అంటే ఏమిటి..?
పుచ్చు పట్టడం లేదా డ్యామేజ్ అవ్వడం వంటి కారణాలు లేకుండానే, దంతాల పైపొర ఎనామెల్ (enamel) క్రమంగా అరిగిపోవడాన్ని 'టూత్ వేర్' అంటారు. ఎనామెల్ అరిగిపోయి లోపల ఉండే 'డెంటిన్' బయటపడటం వల్ల పళ్లు పచ్చగా మారడం, సెన్సిటివిటీ వంటి సమస్యలు వస్తాయి.
ప్రధాన రకాలు - కారణాలు..
అట్రిషన్ (Attrition)పళ్లను ఒకదానికొకటి గట్టిగా రుద్దడం అంటే గ్రైండింగ్. దంతాలు కొరుకుడు కారణంగా ఉపరితలం ఫ్లాట్‌గా మారుతుంది. ఎరోషన్ (Erosion)శీతల పానీయాలు, సిట్రస్ పండ్లు లేదా ఎసిడిటీ వల్ల కలిగే ఆమ్ల ప్రభావం. ఎనామెల్ కరిగిపోయి పళ్లు పల్చగా, పచ్చగా కనిపిస్తాయి. అబ్రేషన్ (Abrasion)గట్టి బ్రష్‌తో అతిగా రుద్దడం, గోళ్లు కొరకడం వంటి బాహ్య చర్యలు. చిగుళ్ల వద్ద వి-షేప్ (V-shape) గుంటలు పడతాయి. వేడి లేదా చల్లని పదార్థాలు తిన్నప్పుడు పళ్లు జివ్వుమనడం.
దంతాల అంచులు పారదర్శకంగా లేదా రంపపు పళ్లలా మారడం. వెనుక పళ్లు అరిగిపోయి చిన్నవిగా కనిపించడం. దంతాలు పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. దంతాల ఎనామెల్ ఒకసారి పోతే మళ్లీ తిరిగి రాదు. అందుకే ప్రతి ఒక్కరూ దంతాల సంరక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దంతవైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
గట్టిగా (Horizontal) రుద్దడం మానేసి, సున్నితంగా బ్రష్ చేయండి. సోడాలు, స్పోర్ట్స్ డ్రింక్స్ పరిమితం చేయండి. ఒకవేళ తాగినా వెంటనే నీటితో నోరు శుభ్రం చేసుకోండి. వెంటనే బ్రష్ చేయకండి.. పుల్లటి పదార్థాలు తిన్న వెంటనే బ్రష్ చేయకూడదు. కనీసం 30 నుంచి 60 నిమిషాల తర్వాతే బ్రష్ చేయాలి. నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉంటే వైద్యుల సలహాతో నైట్ గార్డ్ వాడండి. బాటిల్ క్యాప్స్ తీయడానికి లేదా ప్యాకెట్లు చింపడానికి దంతాలను వాడటం వల్ల అరిగిపోయే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
