Happiness : సంతోషం మన చేతుల్లోనే! ఒత్తిడిని జయించడానికి చిట్కాలు..!

సాక్షి లైఫ్ : కుటుంబం, వృత్తి, సామాజిక బాధ్యతల మధ్య మహిళలు ఒత్తిడి (Stress), ఆందోళన (Anxiety)కు ఎక్కువగా గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. పిల్లలకు తల్లిగా, వృద్ధులకు సంరక్షకురాలిగా, ఉద్యోగిగా... అనేక పాత్రలు పోషించాల్సి రావడం దీనికి ప్రధాన కారణం. శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టినంతగా, చాలా మంది మానసిక ఆరోగ్యం (Mental Health) గురించి పట్టించుకోవడం లేదు. అందుకే, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించడానికి మహిళలు సొంతంగా అనుసరించాల్సిన అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

1. సమయానికి ప్రాధాన్యత ఇవ్వండి (Prioritize Time)
రోజులో కనీసం 30 నిమిషాలు కేవలం మీ కోసమే కేటాయించండి. దీన్ని 'స్వయం సంరక్షణ' (Self-Care) అంటారు. ఏకాంతం (Alone Time): ఈ సమయంలో తోటపని (Gardening), పుస్తకాలు చదవడం (Reading), సంగీతం వినడం (Music) లేదా పెయింటింగ్ వంటి మీకు ఇష్టమైన అభిరుచులను (Hobbies) కొనసాగించండి. ఇలా చేయడం వల్ల మీ మెదడుకు రిలీఫ్ ను కలిగించి, ఒత్తిడి హార్మోన్లైన కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇవి రీసెట్ బటన్ లా పనిచేస్తాయి.. 

2. హద్దులు పెట్టుకోవడం నేర్చుకోండి (Set Boundaries)
మన శక్తి, సమయం పరిమితం. అనవసరమైన బాధ్యతలు, ఇతరుల భారం మోయడం మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. 'లేదు' (No) అని చెప్పండి..  మీకు ఇష్టం లేని పనిని సున్నితంగా 'లేదు' అని చెప్పడానికి భయపడకండి. ఇతరుల కోసం మీ ఆనందాన్ని త్యాగం చేయకండి.
శక్తిని కాపాడుకోండి: ఇది మీ భావోద్వేగ స్థిరత్వాన్ని (Emotional Steady) కాపాడుకోవడానికి, మీ శక్తిని (Energy) రక్షించుకోవడానికి సహాయపడుతుంది.

3. శారీరక,మానసిక ఆరోగ్యం.. 

మనసు, శరీరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. శారీరక ఆరోగ్యం బాగా ఉంటే, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. యోగా, ధ్యానం.. రోజువారీ యోగా, ధ్యానం (Meditation) చేయండి. యోగా హార్మోన్ల మార్పులకు (ముఖ్యంగా రుతుక్రమం, మెనోపాజ్ సమయాల్లో) అనుగుణంగా మారడానికి, ఒత్తిడిని తగ్గించడానికి బాగా ఉపయోగ పడుతుంది. పోషకాహారం.. విటమిన్లు, ఖనిజాలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం (Balanced Diet) తీసుకోవడం మెదడు పనితీరుకు, మానసిక శ్రేయస్సుకు చాలా అవసరం. రక్తహీనత వంటి లోపాలను ఆహారంతో అధిగమించవచ్చు.

4. సామాజిక అనుబంధాన్ని బలోపేతం చేసుకోండి.. (Strengthen Social Connections)బంధాలు, మద్దతు మానసిక ఆరోగ్యానికి పునాది.

మాట్లాడటం (Talk It Out): మీరు నమ్మే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మీ సమస్యల గురించి, భావోద్వేగాల గురించి ఓపెన్‌గా మాట్లాడండి. మీ బాధను బయటపెడితే ఇతరులు ఏమనుకుంటారోనని భయపడకండి. ఒంటరితనాన్ని దూరం: మీ సమస్యలు ఇతరులతో పంచుకోవడం ద్వారా ఒంటరితనం (Loneliness) తగ్గుతుంది.

5. పరివర్తనను స్వీకరించండి (Embrace Self-Acceptance)
జీవితంలో వచ్చే ప్రతికూల మార్పులను, సవాళ్లను ధైర్యంగా అంగీకరించండి. స్వీయ ప్రేమ (Self-Love): మీ లోపాలను, విజయాలను రెండింటినీ అంగీకరించడం, ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. అప్పుడే ఇతరులు మిమ్మల్ని పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా మీరు సంతోషంగా ఉండగలుగుతారు.

వృత్తిపరమైన సహాయం: ఒత్తిడి లేదా ఆందోళన ఎక్కువైతే, లేదా మీ సమస్యలు మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే, ఆలస్యం చేయకుండా థెరపిస్ట్‌లు లేదా కౌన్సిలర్ల సహాయం తీసుకోవాలి.  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health mental-tensions mental-problems mental-issues mental-health-problems mental-stress mental-illness world-mental-health-day-theme-2025 mental-health-day-2025 mental-health-in-emergencies
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com