Onion Juice: ఉల్లిపాయ రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

షేర్ చేయండి:
Onion Juice: ఉల్లిపాయ రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

సాక్షి లైఫ్ : ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించడం, రక్తం గడ్డకట్టడాన్ని నివారించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఉల్లిపాయలలో ఉండే కొన్ని సమ్మేళనాలు యాంటీ డయాబెటిక్ ప్రభావాలను కలిగి ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి. ఇవి  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. అంతే కాదు, ఉల్లిపాయలు ఫైబర్ కంటెంట్ కు గొప్ప మూలం. ఇది జీర్ణక్రియకు సహాయపడడం ద్వారా పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

మనం నిత్యం వంటల్లో ఉపయోగించే వాటిల్లో ఉల్లిపాయ ముఖ్యమైనది. వంటకాన్ని రుచిగా మార్చడంలోనే కాకుండా, అనేక ఆరోగ్యకరమైన పోషకాలు కలిగి ఉంది. రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి రక్తంలో చక్కెరను నియంత్రించడం వరకు, ఉల్లిపాయలు అనేక విధాలుగా సహాయపడతాయి. కాబట్టి రోజూ ఉల్లిపాయ రసం తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

"బి" వంటి విటమిన్లు, పొటాషియం,మాంగనీస్ వంటి ఖనిజాలు..

ఉల్లిపాయలో విటమిన్ "సి" , "బి" వంటి విటమిన్లు, పొటాషియం,మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి ఉల్లిపాయ రసం తాగడం వల్ల ఈ పోషకాలు అందుతాయి. విటమిన్ "సి" ఉన్న ఉల్లిపాయ రసం తాగడం కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి సహాయపడుతాయి. అంతేకాదు కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి కూడా. ఉల్లిలో ఉండే సల్ఫర్, ఇతర యాంటీఆక్సిడెంట్లు కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

ఉల్లిపాయల్లోని..

ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించడం, రక్తం గడ్డకట్టడాన్ని నివారించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఉల్లిపాయలలో ఉండే కొన్ని సమ్మేళనాలు యాంటీ డయాబెటిక్ ప్రభావాలను కలిగి ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి. ఇవి  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతాయి. అంతే కాదు, ఉల్లిపాయలు ఫైబర్ కంటెంట్ కు గొప్ప మూలం. ఇది జీర్ణక్రియకు సహాయపడడం ద్వారా పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.