సాక్షి లైఫ్ : చియా సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, రకరకాల అసంతృప్త కొవ్వులు, పీచుపదార్థం, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మైరిసెటిన్, క్వెర్సెటిన్ సమ్మేళనం, కెఫిక్ యాసిడ్ ,రోస్మరినిక్ యాసిడ్ ఉంటాయి. వాస్తవానికి, అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం చియాసీడ్స్ ఉపయోగ పడతాయి. ఇవి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అసలు వదిలి పెట్టరు.
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఫైబర్..
చియా గింజల్లో ఔన్సు (28 గ్రాములు) 138 కేలరీలు ఉంటాయి. వాటిలో 6శాతం నీరు, 46శాతం కార్బోహైడ్రేట్లు ,వీటిలో 83శాతం ఫైబర్, 34శాతం కొవ్వు , 19 శాతం ప్రోటీన్లు ఉంటాయి.
చియా విత్తనాలు పేగు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ పేగు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ గింజలు జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. ఈ గింజల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల మధుమేహం, కొవ్వుల అసమతౌల్యత ,అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇవి చర్మానికి చాలా మంచివి. కీళ్ల నొప్పులు, నడవడంలో ఇబ్బంది ఉన్నవారికి ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి. చియా విత్తనాలను కూరగాయలతో కలిపి తినవచ్చు. అంతేకాదు వాటిని కాల్చుకుని కూడా తినవచ్చు. మీరు బరువు తగ్గాలనుకుంటే సలాడ్ రూపంలో వీటిని తినవచ్చు. ఇవి ఆకలిని కూడా తీరుస్తాయి.