Memory : జ్ఞాపకశక్తిని పెంచడంలో కాపర్ పాత్ర..?
సాక్షి లైఫ్ : మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తి , ఏకాగ్రతను మెరుగుపరచడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. రాగి (కాపర్) ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని, వృద్ధాప్యంలో వచ్చే డిమెన్షియా వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని తాజాగా జరిగిన ఓ పరిశోధన తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం, రాగి తగినంత పరిమాణంలో శరీరానికి లభిస్తే మెదడు కణాలు చురుకుగా పనిచేస్తాయని వెల్లడైంది.
ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..?
ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే
ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
అధ్యయనం కోసం..
ఈ కొత్త అధ్యయనాన్ని అమెరికాలోని ప్రముఖ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. పరిశోధకులు రాగి అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వారిపై ,రాగి తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వారిపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో రాగి అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వారి మెదడు పనితీరు మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. వారిలో జ్ఞానాత్మక సామర్థ్యాలు, జ్ఞాపకశక్తి, సమస్య పరిష్కార నైపుణ్యాలు గణనీయంగా పెరిగాయి.
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
