బొప్పాయి తినడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుందా..?  

షేర్ చేయండి:
బొప్పాయి తినడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుందా..?  

సాక్షి లైఫ్ : ప్రతిరోజూ మనం తినే ఆహారపదార్థాల్లో కొన్ని శరీరానికి చలువ చేసేవి.. మరికొన్ని వేడి చేసేవి ఉన్నాయి. అటువంటి వాటిలో చాలా మందికి అపోహలు, అనుమానాలు ఉంటాయి. ఈ విషయంలో బొప్పాయి తినడం వల్ల ఒంట్లో విపరీతంగా వేడి పెరుగుతుందని చెబుతారు. ఇది ఎంతమాత్రం నిజంగా కాదని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు  మామిడి పండ్లు, గోధుమ పిండితో చేసిన ప‌దార్థాలు, తేనె, గోంగూర, ఆవ‌కాయ వంటివి తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి చేస్తుందని అంటుంటారు. ఇది ఏమాత్రం వాస్తవం కాదు.. అసలు ఒంటికి చలువ చేసే ఆహార పదార్థాలు, వేడి చేసే పదార్థాలనేవి ఉంటాయా..?  

 

ఇది కూడా చదవండి..Menopause : మెనో పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..?

ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

వేడిచేసిన సమయంలో  క‌ళ్ల మంట‌లు, త‌ల‌నొప్పి, మూత్రంలో మంట‌, శ‌రీరానికి వేడి త‌గిలిన‌ప్పుడు శ‌రీరం మండిన‌ట్టు అనిపించ‌డం, మూత్రం వేడిగా రావ‌డం వంటి ల‌క్ష‌ణాలనేవి శ‌రీరంలో వేడి చేసిన‌ప్పుడు సహజంగా కనిపిస్తుంటాయి. శ‌రీరంలో వేడి చేసిన‌ప్పుడు ఎక్కువ‌గా పంచ‌దార నీళ్లను, స‌గ్గు బియ్యం పాయ‌సాన్ని, నిమ్మ కాయ నీళ్లను, శీత‌ల పానీయాల‌ను ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు. 

ఇవి నీరు ఎక్కువ‌గా క‌లిగిన ఆహార‌ ప‌దార్థాలు మాత్ర‌మే. కానీ నీరు కాదు. కాబట్టి శ‌రీరంలో వేడి చేసిన‌ప్పుడు వీటిని తాగ‌డం కంటే నీళ్ల‌ను తాగ‌డం వల్లే శ‌రీరంలో వేడి త్వ‌ర‌గా త‌గ్గుతుంది. నీళ్లు చాలా త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యి వెంట‌నే ర‌క్తంలో క‌లుస్తాయి. 

 నీరు క‌లిగిన ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వల్ల ఇవి జీర్ణ‌మ‌వ్వ‌టానికి సుమారుగా రెండు గంట‌లకు పైగా స‌మ‌యం ప‌డు తుంది. ఈ ఆహార ప‌దార్థాల‌లో ఉండే నీరు ర‌క్తంలో క‌ల‌వ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. కాబట్టి నీరు ఎక్కువ‌గా తాగాలి.

మ‌న శ‌రీరానికి 70 శాతం నీళ్లు, 30 శాతం ఆహార ప‌దార్థాలు అవ‌స‌రం అవుతాయి. కాబట్టి రోజుకి క‌నీసం నాలుగు లీట‌ర్ల నీరు తాగాలి. వేస‌వి కాలంలో ఒక రోజుకి క‌నీసం ఐదులీట‌ర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి చేయ‌దు. వేడి చేసిన వారు లేదా వేడి చేయ‌కుండా ఉండ‌డానికి ఉద‌యం ప‌ర‌గ‌డుపున లీట‌ర్ నుంచి లీట‌రన్నర నీళ్ల‌ను తాగాలి. 

ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేసేట‌ప్పుడు నీటిని తాగ‌కుండా బ్రేక్ ఫాస్ట్ చేసిన త‌రువాత ఒక గంట నుంచి మ‌ధ్యాహ్న భోజ‌నానికి మ‌ధ్య‌లో మూడునుంచి నాలుగు గ్లాసుల నీళ్లను తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల తాగిన నీరు వెంట‌నే రక్తంలో క‌లుస్తుంది. భోజ‌నం చేసిన త‌రువాత రెండు గంట‌ల నుంచి మ‌ళ్లీ నీటిని తాగ‌డం ప్రారంభించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి త‌గ్గుతుంది. ఇలా నీటిని తాగుతూ ఎటువంటి ఆహార ప‌దార్థాల‌ను తిన్నా..శ‌రీరంలో వేడి చెయ్య‌దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..మెనోపాజ్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.