రెయినీ సీజన్లో అస్సలు తీసుకోకూడని ఫుడ్స్ ఇవే..
సాక్షి లైఫ్ : వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ ఆరోగ్య సమస్యలను కూడా తెస్తుంది. ఈ కాలంలో ఎదురయ్యే సాధారణ సమస్యల్లో అజీర్ణం ఒకటి. వాతావరణంలో పెరిగే తేమ కారణంగా మన జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. దీంతోపాటు బ్యాక్టీరియా కూడా త్వరగా పెరుగుతుంది. ఇది వర్షాకాలంలో అనారోగ్యాలకు దారితీస్తుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో మనం ఇష్టపడే వేయించిన, మసాలా ఆహారాలు జీర్ణవ్యవస్థపై మరింత భారం పెంచుతాయి. కాబట్టి, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ సీజన్‌లో కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
బార్లీ..
బార్లీలో పోషకాలు చాలా ఉన్నాయి కానీ, వర్షాకాలంలో ఇవి జీర్ణం కావడం కష్టం. బార్లీతో తయారు చేసిన ఆహారాలు జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలిగించవచ్చు. తద్వారా గ్యాస్ సమస్యలు కూడా తలెత్తవచ్చు.
మిల్లెట్స్..
మిల్లెట్స్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. కానీ జీర్ణం కావడానికి కాస్త సమయం ఎక్కువగా పడుతుంది. కాబట్టి అరుగుదల తక్కుగ ఉన్నవాళ్లు వర్షాకాలంలో చిరుధాన్యాలు తినకుండా ఉండటం మంచిది.ఈ సీజన్లో సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం, వేయించిన ,జంక్ ఫుడ్స్‌ను తగ్గించడం ద్వారా అజీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఓట్స్..
ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవే, కానీ కొన్ని సార్లు ఇవి అజీర్ణం సమస్యకు కారణమవుతాయి. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు వర్షాకాలంలో ఓట్స్‌ను తగ్గించడం ఉత్తమం.
జొన్నలు..
జొన్నలు కూడా అజీర్ణ సమస్యలను పెంచుతాయి. వర్షాకాలంలో అధిక పిండి పదార్థం కలిగిన జొన్నలు తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
జంక్ ఫుడ్..
మైదా పదార్థాలతో తయారైన జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, ముఖ్యంగా వర్షాకాలంలో ఇవి మరింత పెరుగుతాయి. నూడిల్స్, పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్స్ జీర్ణ సమస్యలను పెంచుతాయి.
గోధుమలు..
గోధుమల్లో గ్లూటాన్ అధికంగా ఉంటుంది, ఇది ఉబ్బరం, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. గ్లూటాన్ సెన్సిటివిటీ ఉన్న వారిలో అజీర్ణం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో బ్రెడ్, పేస్ట్రీలు వంటి గోధుమ ఉత్పత్తులను తగ్గించడం మంచిది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
