ఆహార మార్పులతో ఆరోగ్యం సాధ్యమే.. అంటున్న నిపుణులు..
సాక్షి లైఫ్ : ఆహార మార్పులతో ఆరోగ్యం సాధ్యమేనని వైద్యనిపుణులు వెల్లడించారు. ఫిజీషియన్స్ అసోసియేషన్ ఫర్ న్యూట్రిషన్ (పిఏఎన్) ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో 29వ ఇన్-పర్సన్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సిఎమ్ఈ) కార్యక్రమంలో వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి మార్పులు కావాలి..?
ఎలాంటి మార్పులు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగకరంగా ఉంటాయి..? అనేదానిపై డాక్టర్లు చర్చించారు. ఇందులో భాగంగా న్యూట్రిషనల్ వ్యాల్యూస్ కలిగిన ఫుడ్, ముఖ్యంగా మొక్కల ద్వారా లభించే ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది నిపుణులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..
ఈ సందర్భంగా డా..హేమలత, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రజీన షహిన్, డా.ప్రత్యుష నెరెళ్ల వంటి వైద్య నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆధునిక పరిశోధనలకు సంబంధించిన ఫలితాలను గురించి వివరించారు. అంతేకాదు డా. రాజేందర్ రామగిరి ఆధ్వర్యంలో డయాబెటిస్ రిమిషన్‌పై కేస్ ప్రెజెంటేషన్, జీవన శైలిలో మార్పులతో వచ్చిన అద్భుత ఫలితాలను వెల్లడించారు.
డా.సుందీప్ లక్టాకియా వైద్య రంగంలో పోషకాహారంసమగ్రతపై చర్చించారు. డా.హేమలత ప్రసంగంలో నిరోధక ఆరోగ్యం, వ్యాధి నిర్వహణలో పోషకాహారం ప్రాధాన్యతను గురించి వివరించారు.
ఇది కూడా చదవండి..చలికాలంలో మెదడు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?
ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
