హెల్తీ డైట్ సంబంధించిన అపోహలు -వాస్తవాలు
సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన ఆహారం ఎల్లప్పుడూ మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే కొందరికి ఆరోగ్యకరమైన ఆహారానికి సంబంధించిన కొన్ని సందేహాలు ఉంటాయి. అటువంటి వాటిలో ఎంత వరకూ వాస్తవాలున్నాయి..? ఎంతవరకూ అపోహలున్నాయి..? అనేది తెలుసుకుందాం..
ఆరోగ్యంగా ఉండటానికి, ప్రజలు తరచుగా వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మనం ఏది తిన్నా అది నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే పెద్దలతోపాటు వైద్య నిపుణుల వరకు అందరూ హెల్తీ డైట్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అయితే, ఆరోగ్యంగా ఉండటానికి, ఆహారం మాత్రమే ముఖ్యం కాదు, దానికి సంబంధించిన సరైన సమాచారం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా కొందరు ఆరోగ్యకరమైన ఆహారానికి సంబంధించిన కొన్ని అపోహలను నమ్ముతారు. అప్పుడు తెలిసి లేదా తెలియకుండా అవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?
ఇది కూడా చదవండి..వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?
ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే..
అపోహ : బరువు తగ్గడానికి భోజనం తినకుండా ఉండడం మంచిదేనా..?
వాస్తవం: భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతారనేది అపోహ మాత్రమే. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. అంతేకాదు ముఖ్యంగా జీవక్రియను నెమ్మదిస్తుంది. కడుపు నిండా తిన్నప్పుడు సరిగా అరగకపోగా జీర్ణసమస్యలను కలిగిస్తుంది. తినడం మానేస్తే శక్తి లేక నీరసంగా అనిపిస్తుంది. మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. మొత్తం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
అపోహ : శరీరాన్ని డిటాక్స్ టీ శుభ్రపరుస్తుందా..?
వాస్తవం: దీని గురించి నిజం తెలుసుకోవడం చాలా ముఖ్యం. డిటాక్స్ టీ మీ శరీరాన్ని నిర్విషీకరణ చేసినప్పటికీ, ఇందులో ఉండే లాక్సిటివ్‌లు డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు కారణమవుతాయి. కాలేయం ,మూత్రపిండాలు సహజంగా శరీరాన్ని నిర్విషీకరణం చేస్తాయి. టీ లేదా ఇతర పానీయాలు దీని కంటే మెరుగైన పనిని చేయలేవని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?
ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
