Heat wave : 45°C డిగ్రీలు దాటితే ప్రాణాంతకమే.. కీలక అవయవాలపై వడగాల్పుల ప్రభావం ఇదీ..!

షేర్ చేయండి:
Heat wave : 45°C డిగ్రీలు దాటితే ప్రాణాంతకమే.. కీలక అవయవాలపై వడగాల్పుల ప్రభావం ఇదీ..!

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా భానుడు భీభత్సం సృష్టిస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ సహా పలు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటేసి నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల ప్రకారం రాబోయే రోజుల్లోనూ ఈ తీవ్రత ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది. అయితే, ఈ స్థాయి ఉష్ణోగ్రతలు కేవలం రోజువారీ అసౌకర్యాన్ని మాత్రమే కాకుండా.. మన శరీరంలోని గుండె, కిడ్నీలు, కాలేయం, మెదడు వంటి కీలక అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా మానవ శరీర ఉష్ణోగ్రత 37∘C గా ఉంటుంది. వాతావరణంలో వేడి పెరిగినప్పుడు శరీరం తనను తాను చల్లబరుచుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ క్రమంలో అంతర్గత అవయవాలపై పడే అదనపు ఒత్తిడి ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుందో ఇప్పుడు చూద్దాం..

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

 

1. గుండెపై తీవ్ర ఒత్తిడి.. పెరగనున్న హార్ట్ ఎటాక్ ముప్పు..

తీవ్రమైన వడగాల్పుల ప్రభావం గుండెపై అత్యధికంగా ఉంటుంది. వాతావరణంలో వేడి పెరిగినప్పుడు శరీరం చర్మానికి రక్త ప్రసరణను విపరీతంగా పెంచుతుంది. చెమట రూపంలో వేడిని బయటకు పంపేందుకు గుండె సాధారణం కంటే వేగంగా కొట్టుకోవాల్సి వస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. తీవ్రమైన వేడి వల్ల డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) ఏర్పడి రక్తం చిక్కబడుతుంది. దీనివల్ల రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనై, ఎలక్ట్రోలైట్ల (సోడియం, పొటాషియం) సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా గుండెపోటు (Heart Attack), పక్షవాతం (Stroke) వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

2. కిడ్నీలపై కూడా తీవ్ర ప్రభావం..  

ఎండ తీవ్రతకు శరీరంలో నీటి కొరత ఏర్పడితే మొదట దెబ్బతినేది మూత్రపిండాలే. సీనియర్ నెఫ్రాలజిస్టుల ప్రకారం.. విపరీతంగా చెమట పట్టడం వల్ల ద్రవాలు కోల్పోయి, కిడ్నీలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ అధ్యయనాల ప్రకారం.. ఎక్కువసేపు ఎండలో పనిచేసే వారిలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. శరీరంలో నీరు తగ్గడం వల్ల మూత్రం చిక్కబడి, ఖనిజాలు స్ఫటికాలుగా పేరుకుపోతాయి. ఇది కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటానికి, తీవ్రస్థాయిలో కిడ్నీ ఫెయిల్యూర్ (Acute Kidney Injury)కు దారితీస్తుంది.

అవయవాలపై ఉష్ణోగ్రతలు చూపించే ప్రభావాలు.. రక్తం చిక్కబడటం, హృదయ స్పందన రేటు పెరగడం, కార్డియాక్ అరెస్ట్ ముప్పు.

మూత్రపిండాలు.. మూత్రం చిక్కబడటం, కిడ్నీలో రాళ్లు, రక్త ప్రసరణ తగ్గడం వల్ల కిడ్నీ వైఫల్యం.

కాలేయం..లివర్ ఎంజైమ్‌ల హెచ్చుతగ్గులు, కణాల నాశనం, కాలేయ వాపు.

మెదడు.. హైపోథాలమస్ వైఫల్యం, వడదెబ్బ (Heat Stroke), పక్షవాతం, స్పృహ తప్పడం.

3. కాలేయం (Liver) కూడా ప్రమాదంలోనే..

వడదెబ్బ తగిలినప్పుడు శరీరంలో కాలేయ ఎంజైమ్‌ల స్థాయిలు అసాధారణంగా పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. డీహైడ్రేషన్ వల్ల కాలేయానికి అందాల్సిన ఆక్సిజన్, పోషకాల సరఫరా నిలిచిపోతుంది. ఎండల తీవ్రతకు అంతర్గత ఉష్ణోగ్రత పెరిగినప్పుడు లివర్ కణాలు దెబ్బతినడమే కాకుండా, కాలేయ వాపు (Inflammation) వచ్చే ప్రమాదం ఉంది.

4. మెదడు పనితీరు మందగిస్తుంది..

మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం మెదడులోని 'హైపోథాలమస్' (Hypothalamus) లో ఉంటుంది. ఉష్ణోగ్రత 45∘C దాటినప్పుడు ఈ నియంత్రణ వ్యవస్థ విఫలమై 'హీట్ స్ట్రోక్' (వడదెబ్బ) తగులుతుంది. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ అందక గందరగోళం, తలతిరగడం, మాట తడబడటం, మూర్ఛ రావడం లేదా స్పృహ కోల్పోవడం వంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాక, నీటి కొరత వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మందగిస్తాయి.

 ఏం చేయాలి..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక రోగులు ఈ వడగాల్పుల సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. దాహం వేయకపోయినా ప్రతి గంటకూ నీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ (ORS) ద్రావణం, కొబ్బరినీళ్లు తాగుతుండాలి. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే ఉత్తమం.

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.