SunStroke: వడదెబ్బ తగిలినప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సూర్యుడు తన ప్రతాపాన్ని ఓ రేంజ్ లో చూపిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుండటంతో పాటు వడగాలులు కూడా మొదలయ్యాయి. ఈ వేడి గాలుల వల్ల శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగి 'వడదెబ్బ' (Heat Stroke) తగిలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఎండలో పనిచేసే వారు అధిక అప్రమత్తతతో ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

డీహైడ్రేషన్..


శరీరం తన ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోలేనప్పుడు వడదెబ్బ తగులుతుంది. చెమట ద్వారా నీటిని, ఎలక్ట్రోలైట్లను కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి నీరసం, తలతిరగడం వంటి లక్షణాలు తలెత్తుతాయి. వడదెబ్బ తగిలిన వెంటనే ఆయా సంకేతాలను గుర్తించి చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదకరం. 1. అధిక శరీర ఉష్ణోగ్రత అంటే..? శరీర ఉష్ణోగ్రత 40°C (104°F) కంటే ఎక్కువగా పెరుగుతుంది. 2. చెమట పట్టక పోవడం..సాధారణంగా చెమట పట్టాలి, కానీ వడదెబ్బ సమయంలో చర్మం పొడిగా మారుతుంది.

3. చర్మం ఎర్రగా, వేడిగా మారుతుంది.. 4. తలనొప్పి,తల తిరగడం, 5. వాంతులు, వికారంగా అనిపించడం.. 6. గుండె వేగంగా కొట్టుకోవడం.. 7. గందరగోళంగా అనిపించడం.. మాటలు అర్థం చేసుకోలేకపోవడం ..8. పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోవడం కూడా జరుగుతుంది.. ఇవన్నీ వడదెబ్బ తగిలినప్పుడు కనిపించే సంకేతాలే..   
 
రోజంతా తగినంత నీరు..  

దాహం వేసినా వేయకపోయినా రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండాలి. శరీరంలో తేమ తగ్గకుండా ఉండటానికి ఓఆర్ఎస్ (ORS) ద్రావణం లేదా నిమ్మరసం వంటివి తీసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ సమయంలో బయట తిరగడం తగ్గించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తే.. తల గొడుగు, టోపీ లేదా కాటన్ తువ్వాలుతో కప్పుకోవాలి.

దుస్తుల ఎంపిక చాలా ముఖ్యం.. బిగుతుగా ఉండే సింథటిక్ దుస్తులకు బదులుగా, వేడిని గ్రహించని తేలికపాటి కాటన్ దుస్తులు, లేత రంగు బట్టలు ధరించడం ఉత్తమం. ఇవి చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.

ప్రకృతి సిద్ధమైన పానీయాలు తీసుకోవాలి..

కృత్రిమ శీతల పానీయాల కంటే ఇంట్లోనే తయారు చేసుకునే సహజ సిద్ధమైన పానీయాలతో ఎంతో మేలు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, వెలగపండు రసం వంటివి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
తాజా పండ్లు, సలాడ్లు వంటి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

 
వడదెబ్బ తగిలినప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, వాంతులు లేదా వికారం, తీవ్ర జ్వరం, నీరసం, చర్మం పొడిబారి ఎర్రబడటం జరుగుతుంది. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి, తడి గుడ్డతో ఒళ్లు తుడవాలి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని వైద్యుడిని సంప్రదించాలి. సన్ స్ట్రోక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి 'ముందస్తు జాగ్రత్త' కంటే మెరుగైన మందు లేదు..!

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.