High Blood Pressure Rising Among Youth : యువతను వదలని హైబీపీ.. ఇవే ప్రధాన కారణాలు..  

షేర్ చేయండి:
High Blood Pressure Rising Among Youth : యువతను వదలని హైబీపీ.. ఇవే ప్రధాన కారణాలు..  

సాక్షి లైఫ్ : ఒకప్పుడు వృద్ధాప్య సమస్యగా భావించే 'అధిక రక్తపోటు' (High BP) ఇప్పుడు యువతను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మన రక్తనాళాలపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. తాజాగా గణాంకాలు, వైద్య నిపుణుల హెచ్చరికలు ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లోని ఓపీ విభాగానికి ప్రతిరోజూ సుమారు 50 నుంచి 60 మంది రక్తపోటు బాధితులు వస్తుండగా.. వీరిలో వృద్ధుల కంటే ఎక్కువ సంఖ్యలో యువకులు మాత్రమే ఉంటున్నారు.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

 

 అధికంగా ఉప్పు తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం వల్ల శరీరంలో సోడియం సమతుల్యత దెబ్బతిని రక్తపోటు పెరుగుతోంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది" అని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముప్పు పెంచుతున్న కారణాలు ఇవే..

రక్తపోటు పెరగడానికి ప్రధానంగా మూడు అంశాలు కారణమవుతు న్నాయని పరిశోధనలో తేలింది. ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, మసాలా వంటకాల్లో ఉప్పు అధికంగా ఉంటోంది. ఇది నేరుగా రక్తపోటును పెంచుతుంది. రోజంతా తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల శరీరం నిర్జలీకరణానికి (Dehydration) గురవుతుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేసి బీపీకి దారితీస్తుంది. నిద్రలేమి, గ్యాడ్జెట్లు..యువత రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్, కంప్యూటర్లకు అతుక్కుపోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి రక్తపోటు సమస్యలు తలెత్తుతున్నాయి.

నివారణ మార్గాలు ఏమిటి..? 

రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి నిపుణులు ఈ క్రింది సూచనలు చేస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని పరిమితం చేయాలి. నిల్వ పచ్చళ్లు, అప్పడాలకు దూరంగా ఉండాలి.రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట కనీసం 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర అవసరం. జంక్ ఫుడ్‌కు స్వస్తి చెప్పాలి. ఎటువంటి లక్షణాలు లేకపోయినా కనీసం నెలకు ఒకసారి బీపీ పరీక్ష చేయించుకోవడం ఉత్తమమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.