High-Dose Nimesulide Banned in India : భారతదేశంలో హై డోస్ నిమెసులైడ్‌పై నిషేధం.. కారణం ఇదే..

షేర్ చేయండి:
High-Dose Nimesulide Banned in India : భారతదేశంలో హై డోస్ నిమెసులైడ్‌పై నిషేధం.. కారణం ఇదే..

సాక్షి లైఫ్ : నొప్పి, జ్వరం తగ్గడానికి మనం తరచుగా వాడే పెయిన్ కిల్లర్ 'నిమెసులైడ్'(Nimesulide)పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 100 మిల్లీగ్రాముల (100mg) కంటే ఎక్కువ మోతాదు ఉన్న 'ఇమిడియట్ రిలీజ్' నిమెసులైడ్ (Nimesulide)ఓరల్ మాత్రలు, సిరప్‌ల తయారీ, విక్రయాలు, పంపిణీని తక్షణమే నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా, సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?

 

నిషేధానికి గల కారణాలు ఏమిటి..? 

 నిమెసులైడ్ అధిక మోతాదులో వాడటం వల్ల కాలేయం (Liver) తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల లివర్ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తవచ్చు. దీర్ఘకాలికంగా ఈ మందును వాడటం వల్ల మూత్రపిండాల పనితీరు మందగించడం, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

 అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ మందును ఎప్పుడో నిషేధించారు. మన దేశంలోనూ 2011లో 12 ఏళ్ల లోపు పిల్లలకు దీనిని వాడకూడదని నిషేధం విధించారు. ఇప్పుడు పెద్దల విషయంలోనూ హై-డోస్‌పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి.

 గమనించాల్సిన విషయాలు..? 

100mg కంటే ఎక్కువ వద్దు: ప్రస్తుతం మార్కెట్‌లో 100mg వరకు ఉన్న నిమెసులైడ్ మాత్రలు అందుబాటులో ఉంటాయి. 200mg లేదా అంతకంటే ఎక్కువ డోస్ ఉన్న ఓరల్ డ్రగ్స్‌ను ప్రభుత్వం నిషేధించింది. నిమెసులైడ్‌కు బదులుగా పారాసిటమాల్ వంటి సురక్షితమైన మందులు అందుబాటులో ఉన్నాయి.

జెల్స్, క్రీములకు మినహాయింపు..  

 చర్మంపై రాసుకునే జెల్స్, క్రీములు (Topical Gels), 100mg కంటే తక్కువ డోస్ ఉన్న మాత్రలపై ఈ నిషేధం వర్తించదు. తలనొప్పి వస్తే చాలు వెంటనే నిమెసులైడ్ లేదా ఇతర పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అలవాటుగా మార్చుకోవద్దని వైద్యనిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా మందు వాడే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. గర్భిణీలు, వృద్ధులు ,లివర్ సమస్యలు ఉన్నవారు ఈ మందులను అసలు తీసుకోకపోవడమే మంచిది. 

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.