Hormonal imbalance : హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే వ్యాధులు గురించి తెలుసా..?
సాక్షి లైఫ్: హార్మోన్లు శరీరంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి చిన్నగా ఉన్నా అవి చూపించే ప్రభావం కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ హార్మోన్ల ఉత్పత్తిలో గానీ వాటి సమతుల్యతలో గానీ ఏమైనా తేడా వస్తే, అనేక రకాల వ్యాధులు తలెత్తుతాయి. వీటినే "ఎండోక్రైన్ సిస్టమ్ డిజార్డర్స్" లేదా "హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే వ్యాధులు" అని అంటారు.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే
ఎలాంటి వ్యాధులు అంటే..?
థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు శరీరంలోని జీవక్రియలను కంట్రోల్ చేస్తాయి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా విడుదల అయితే (హైపోథైరాయిడిజం), బరువు పెరగడం, అలసట, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ హార్మోన్లు అధికంగా విడుదల అయితే (హైపర్‌థైరాయిడిజం), బరువు తగ్గడం, గుండె దడ, ఆందోళన వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
మధుమేహ వ్యాధి : ఇది కూడా హార్మోన్లకు సంబంధించిన సమస్య. క్లోమం(ప్యాంక్రియాస్) ఇన్సులిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల గానీ శరీరం దానికి స్పందించకపోవడం వల్ల గానీ మధుమేహం వస్తుంది. దీని వల్ల గుండె సంబంధిత జబ్బులు, మూత్రపిండాల సంబంధిత సమస్యలు, నరాల బలహీనత వంటివి తలెత్తే ప్రమాదం ఉంది.
పీసీఓఎస్(పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్): ఇది మహిళల్లో సర్వసాధారణంగా కనిపించే హార్మోన్ల సమస్య. అండాలకు సంబంధించిన హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ వ్యాధి వస్తుంది. దీని వల్ల పీరియడ్స్ సైకిల్ దెబ్బతింటుంది. మొటిమలు, బరువు పెరగడం, సంతానలేమి వంటి సమస్యలు వస్తాయి.
ఎడ్రినల్ గ్రంథి సమస్యలు: ఎడ్రినల్ గ్రంథులు స్ట్రెస్ హార్మోన్లను (కార్టిసాల్) ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ల ఉత్పత్తిలో తేడా వస్తే అలసట, అధిక రక్తపోటు, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, కుషింగ్స్ సిండ్రోమ్ (అధిక కార్టిసాల్) లేదా అడిసన్ వ్యాధి (తక్కువ కార్టిసాల్).
పెరుగుదల హార్మోన్ల సమస్యలు: పిల్లల్లో పెరుగుదల హార్మోన్లు సరిగా ఉత్పత్తి కాకపోతే పొట్టితనం (డ్వార్ఫిజం) వస్తుంది. పెద్దల్లో ఈ హార్మోన్లు ఎక్కువైతే ఎక్రోమెగాలీ వంటి సమస్యలు తలెత్తుతాయి. సంతానలేమి: ప్రస్తుత తరంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. స్త్రీ, పురుషులిద్దరిలోనూ హార్మోన్ల అసమతుల్యత సంతానలేమికి ప్రధాన కారణమవుతుంది.
ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
