Teflon flu : టెఫ్లాన్ ఫ్లూనకు ప్రధానకారణాలేంటంటే..?
సాక్షి లైఫ్ : టెఫ్లాన్ అనేది సింథటిక్ కార్బన్, ఫ్లోరిన్ సమ్మేళనం. దీనిని పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్ అని పిలుస్తారు. ఇవి నాన్-రియాక్టివ్, నాన్-స్టిక్, రాపిడి లేకుండా సాఫ్ట్ గా ఉండేలా చేస్తాయి. నాన్‌స్టిక్ పాత్రలు ప్రజలకు వంట చేసుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటాయనే ఉద్దేశంతో ఎక్కువగా వినియోగిస్తున్నారు. స్థాయికి మించి వేడి చేయడంవల్ల వాటి పూతపై ఉండే కెమికల్స్ కరిగి పొగరూపంలో శరీరంలోకి చేరి హానికలిగిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే
ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళ
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధానకారణాలేంటంటే..? టెఫ్లాన్ పూతతో వచ్చిన వంటసామాన్లను సరైన విధానంలో వాడకపోవడం వల్ల వాటి నుంచి వచ్చిన పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి తలనొప్పి, కండరాల నొప్పి, ఫీవర్ వంటివి తలెత్తుతాయి. నాన్‌స్టిక్ వంటసామాను వేడెక్కడం వల్ల వాటిపై ఉండే పూతలోని రసాయనాల విడుదల కారణంగా వచ్చే పొగవల్లనే ఈ సమస్యలు వస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఎక్కువగా వేడిచేసినప్పుడు..
ముఖ్యంగా నాన్ స్టిక్ పాత్రలను ఎక్కువగా వేడిచేసినప్పుడు ఈ రసాయనాలు విడుదలవుతాయి. ఈ పొగ విషపూరితమైనది. ఇలాంటి పొగను పీల్చడం ఫ్లూ వంటి లక్షణాలు తలెత్తుతాయి. PFAS (పర్- అండ్ పాలీఫ్లోరోఅల్కైల్ పదార్ధాలు) రసాయనాలతో తయారు చేసిన నాన్‌స్టిక్ పూతలు శరీరం లోపలికి చేరుతాయి. ఇవి ఫ్లూ లాంటి లక్షణాలను కలిగించడమే కాకుండా ఊపిరితిత్తులవరకూ చేరుతాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ విషపూరితమైన పొగ విడుదల అయిన కొంత సమయం తర్వాత టెఫ్లాన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
