Weight loss : ఇంట్లోనే చేసే 4 సింపుల్ వ్యాయామాలతో రోజుకు కేవలం 10 నిమిషాలు.. 8 నెలల్లో 34 కిలోలు తగ్గిన గృహిణి..!
సాక్షి లైఫ్ : బరువు తగ్గాలంటే భారీ డైట్ ప్లాన్లు, ఖరీదైన జిమ్ లు అవసరం అనే అపోహను తొలగిస్తూ, హైదరాబాద్‌కు చెందిన ఓ గృహిణి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇంటి పనులు, పిల్లల బాధ్యతల మధ్య సమయం చిక్కకపోయినా, రోజుకు కేవలం 10 నిమిషాలు కేటాయించి 8 నెలల వ్యవధిలో 34 కిలోల బరువు తగ్గినట్లు ఆమె తెలిపారు. మొదట్లో మెట్లు ఎక్కడానికి కూడా ఆయాసం వచ్చేదని, క్రమంగా చిన్న చిన్న వ్యాయామాలతో మొదలుపెట్టి ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నానని ఆమె చెప్పారు.
ఇది కూడా చదవండి.. Plantar Fasciitis : ఉదయం మంచం దిగగానే మడమలో సూదులతో గుచ్చినట్టు నొప్పా..? ఐతే ప్లాంటర్ ఫాసిటిస్ కావొచ్చు..!
ఇది కూడా చదవండి.. Refined Oil : రిఫైన్డ్ ఆయిల్ వాడకం ఆరోగ్యానికి ముప్పేనా..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఆమె అనుసరించిన నాలుగు సులభమైన వ్యాయామాలు ఏమిటంటే..?
1.వాకింగ్ ఆన్ స్పాట్.. ఒకే చోట నిలబడి నడక చేయడం ద్వారా గుండె వేగం పెరిగి కేలరీలు ఖర్చవుతాయి.
2. స్క్వాట్స్.. కాళ్లు, తుంటి కండరాలను బలోపేతం చేస్తూ మెటబాలిజాన్ని పెంచుతాయి.
3.ప్లాంక్ హోల్డ్ ..కోర్ కండరాలను బిగించి శరీర భంగిమను మెరుగుపరుస్తుంది.
4. సైడ్ లంజెస్.. తొడలు, పిరుదుల కండరాలపై ప్రభావం చూపుతూ కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి.
వీటితో పాటు..
వీటితో పాటు, ఆహారంలో మైదా పదార్థాలు, చక్కెర తగ్గించి, ఇంట్లో వండిన తాజా ఆహారానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. నీళ్లు ఎక్కువగా తాగడం, రాత్రి త్వరగా నిద్రపోవడం వంటి చిన్న అలవాట్లు కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ఏదైనా కొత్త వ్యాయామం లేదా డైట్ ప్లాన్ ప్రారంభించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. వ్యక్తుల శరీర తత్వాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు.
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
