Refined Oil : రిఫైన్డ్ ఆయిల్ వాడకం ఆరోగ్యానికి ముప్పేనా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : భారతీయ వంటగదుల్లో రిఫైన్డ్ ఆయిల్ (refined oil) వాడకం ఇప్పుడు సర్వసాధారణం. నూనెకు ప్రత్యేకమైన వాసన లేకపోవడం, ఎక్కువ కాలం నిల్వ ఉండటం, అన్ని రకాల వంటకాలకు సులభంగా ఉపయోగించగలగడం వల్ల చాలామంది దీనికే ఓటు వేస్తున్నారు. అయితే, ఏ నూనెనైనా పరిమితికి మించి వాడినా లేదా పదే పదే వేడి చేసినా శరీరానికి తీవ్ర హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు రిఫైన్డ్ ఆయిల్‌తో వంట చేయడం సురక్షితమేనా..? దీని వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

రిఫైన్డ్ ఆయిల్ ఎలా తయారవుతుంది..?

ముడి నూనెను తినడానికి అనువుగా మార్చేందుకు, దానిలోని రంగు, వాసనను తొలగించడానికి పరిశ్రమలలో దీనిని అనేక రసాయన ప్రక్రియలకు గురిచేస్తారు. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయడం, ఫిల్టర్ చేయడం వల్ల నూనె ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఉంటుంది. కానీ, ఈ శుద్ధి ప్రక్రియలో నూనెలోని సహజసిద్ధమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, శరీరానికి మేలు చేసే సమ్మేళనాలు చాలా వరకు నశించిపోతాయి.

ఆరోగ్యానికి కలిగే అనర్థాలు.. 

రిఫైన్డ్ ఆయిల్‌ను అధికంగా, అశాస్త్రీయంగా వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.గుండె జబ్బుల ముప్పు: రిఫైన్డ్ నూనె అయినా లేదా మరే ఇతర నూనె అయినా అధికంగా తీసుకుంటే శరీరంలో కేలరీలు, కొవ్వు పేరుకుపోతాయి. దీర్ఘకాలం పాటు నూనెను ఎక్కువగా వాడటం వల్ల ఊబకాయం, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.

మళ్లీ మళ్లీ వేడి చేస్తే విషతుల్యం..

ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం అత్యంత ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల నూనెలో క్యాన్సర్‌కు దారితీసే హానికరమైన రసాయన సమ్మేళనాలు ఉత్పన్నమవుతాయి.

సురక్షితమైన వాడకం-ప్రత్యామ్నాయాలు..

నూనె వాడకం పూర్తిగా సురక్షితం లేదా పూర్తిగా హానికరం అని చెప్పలేము. మనం ఎంచుకునే నూనె రకం, వండే విధానంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నూనె వాడేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.. రసాయనాలతో శుద్ధి చేసిన రిఫైన్డ్ నూనెలకు బదులుగా, సహజసిద్ధంగా ఎటువంటి వేడి లేకుండా యంత్రాల ద్వారా తీసే గానుగ నూనెలను వాడటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో పోషకాలు యథాతథంగా ఉంటాయి.

 రీ-యూజ్ వద్దు.. ఒకసారి వంటకు వాడిన నూనెను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ వేడిచేసి కూరల్లో వాడకండి. డీప్ ఫ్రైలు తగ్గించండి.. నూనెలో ఎక్కువసేపు వేయించిన పదార్థాలను తినడం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. కూరల్లో నూనె వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. నెలకు ఒక మనిషికి అరలీటరు నూనె మించకుండా చూసుకోవడం మంచిది. మార్కెట్లో ప్యాక్ చేసిన నూనెను కొనుగోలు చేసేటప్పుడు దాని తయారీ, గడువు తేదీ (Expiry date), నాణ్యతా ప్రమాణాలను తప్పకుండా తనిఖీ చేయాలి. విభిన్న రకాల నూనెలను మార్చి మార్చి వాడటం ఆరోగ్యానికి మంచిది.

 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.