బ్లడ్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించవచ్చు..?
సాక్షి లైఫ్ : బ్లడ్ క్యాన్సర్, లేదా హెమటోలాజికల్ క్యాన్సర్.. ఇది ప్రమాదకరమైన వ్యాధి. ఈ క్యాన్సర్ ప్రాణాంతకం అయినా, దీనిని ప్రారంభ దశలో గుర్తిస్తే, సమయానికి చికిత్స చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ముందస్తుగా గుర్తించడం వల్ల త్వరగా చికిత్స ప్రారంభించవచ్చు. అయితే, చాలా మందిలో ఈ లక్షణాలు ముందుగా కనబడకపోవచ్చు. ఈ వ్యాధిని ముందే గుర్తించే కొన్ని ముఖ్యమైన సంకేతాలపై అందరికీ అవగాహనా చాలా అవసరం.
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
అలసట లేదా తరచుగా అంటువ్యాధులు..
చాలా అలసటగా అనిపించడంతోపాటు, మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ల బారిన పడినట్లయితే, అది బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలలో ఒకటి కావచ్చు. ఎందుకంటే క్యాన్సర్ ఆరోగ్యకరమైన కణాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఇది రక్తహీనతకు కారణమవుతుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి కూడా బ్లడ్ క్యాన్సర్ సంకేతమేనని వైద్య నిపుణులు అంటున్నారు.
బరువు తగ్గడం..
అకస్మాత్తుగా బరువు కోల్పోతే, అది బ్లడ్ క్యాన్సర్ మాత్రమే కాదు. ఇతర రకాల క్యాన్సర్ల ప్రారంభ లక్షణాలు కావచ్చు. వ్యాధితో పోరాడటానికి శరీరం శక్తిని ఖర్చు చేసినప్పుడే ఇది జరుగుతుంది. ఇది కాకుండా, కణుపులలో వాపు, ముఖ్యంగా మెడ, నడుము, లింఫోమా లక్షణం కావచ్చు, ఇది రక్త క్యాన్సర్ హెచ్చరిక సంకేతంగా పరిగణిస్తారు.
ఎముకలలో రక్తస్రావం- తీవ్రమైన నొప్పి..
ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం వల్ల చిన్న గాయాలు అయినా ఎక్కువసేపు రక్తస్రావం కావచ్చు. ఇది కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్‌లకు కూడా సంబంధించినది కావచ్చు. రక్త క్యాన్సర్ ఎముక మజ్జను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది ఎముకలలో నొప్పి లేదా పగుళ్లకు కారణం అవుతుంది.
జ్వరం-రాత్రి చెమటలు..
ఎటువంటి కారణం లేకుండా జ్వరంతోపాటు, తరచుగా రాత్రిపూట చెమటలు పట్టడం అనేది బ్లడ్ క్యాన్సర్ కు సంకేతం. వీటితోపాటు ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అందువల్ల, మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఆయా లక్షణాలను బట్టి సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
