Hantavirus : హంటా వైరస్ ఎలా వ్యాపిస్తుంది..? దీని లక్షణాలు ఏమిటి..? నివారణ ఎలా..?

సాక్షి లైఫ్: అట్లాంటిక్ మహాసముద్రంలో చిక్కుకున్న విహార నౌక 'ఎంవీ హోండియస్'లో హంటా వైరస్ కలకలం రేపుతోంది. ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతు న్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది..? దీని లక్షణాలు ఎలా ఉంటాయి..? ఈ వైరస్ బారీన పడకుండా ఉండాలంటే..? ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? అనే అంశాలను గురించి ఇపుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

క్రూయిజ్ షిప్‌లో హంటా వైరస్ పంజా..  

విహార యాత్రలో విషాదం నెలకొంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఎంవీ హోండియస్ క్రూయిజ్ షిప్‌లో ప్రమాదకరమైన హంటా వైరస్ (Hantavirus) సోకి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురికి లక్షణాలు ఉండటంతో వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కేప్ వెర్డే ప్రభుత్వం ఈ నౌకను తీరానికి రావడానికి అనుమతించకపోవడంతో, సుమారు 150 మంది ప్రయాణికులు నడి సముద్రంలోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం క్రూయిజ్ షిప్‌లోని ప్రయాణికులందరినీ వారి క్యాబిన్‌లకే పరిమితం చేసి, వైరస్ మరింత విస్తరించకుండా వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.

ఎలా వ్యాపిస్తుంది అంటే..?

హంటా వైరస్ అనేది ప్రధానంగా ఎలుకలు, ఉడుతలు వంటి రోడెంట్ల (Rodents) ద్వారా వ్యాపిస్తుంది. సోకిన ఎలుకల మూత్రం, మలం లేదా లాలాజలంతో ప్రత్యక్షంగా సంబంధం ఏర్పడినప్పుడు ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. ఎలుకల విసర్జితాలు ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు, ఆ గాలిని పీల్చడం ద్వారా కూడా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సాధారణంగా ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించదు. అయితే, కొన్ని అరుదైన సందర్భాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగే వారి మధ్య (Close contact) పరిమితంగా వ్యాపించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది. 

ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఈ వైరస్ సోకిన తర్వాత లక్షణాలు కనిపించడానికి కొంత సమయం పడుతుంది. ఇవి సాధారణ ఫ్లూ తరహాలోనే మొదలవుతాయి.. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట. అదే తీవ్ర దశలో అయితే..శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తులలో నీరు చేరడం, మూత్రపిండాల వైఫల్యం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

చికిత్స.. నివారణ..

హంటా వైరస్‌కు ప్రస్తుతం నిర్దిష్టమైన టీకా (Vaccine) లేదా ప్రత్యేకమైన మందులు అందుబాటులో లేవు. ఈ వైరస్ కు సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే తప్పనిసరిగా వైద్యనిపుణులను సంప్రదించాలి. ఒకవేళ పరిస్థితి విషమిస్తే ఐసీయూలో వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించాల్సి ఉంటుంది. నివారణే అన్నిటికంటే ఉత్తమ మార్గం. నివాస ప్రాంతాల్లో ఎలుకలు లేకుండా చూసుకోవాలి. ఎలుకల విసర్జితాలు ఉన్న చోట శుభ్రం చేసేటప్పుడు మాస్కులు, గ్లౌజులు ధరించాలి. 

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : prevention preventions hantavirus hantavirus-symptoms hantavirus-outbreak shipping-tours
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com