క్యాన్సర్ ను ముందుగా గుంర్తించే హెచ్‌పీవీ-డీప్‌సీక్ టెస్ట్ ఎలా పనిచేస్తుంది..?

షేర్ చేయండి:
క్యాన్సర్ ను ముందుగా గుంర్తించే హెచ్‌పీవీ-డీప్‌సీక్ టెస్ట్ ఎలా పనిచేస్తుంది..?

సాక్షి లైఫ్ : హెచ్‌పీవీ-డీప్‌సీక్ అనేది రోగి రక్తంలో కలిసిన హెచ్‌పీవీ డీఎన్‌ఏ కణాలను గుర్తించడానికి "హోల్-జినోమ్ సీక్వెన్సింగ్" పద్ధతిని ఉపయోగిస్తారు. గతంలో, ఈ బృందం చేసిన పరిశోధనలో ఈ పరీక్ష 99శాతం కచ్చితత్వంతో క్యాన్సర్‌ను గుర్తించగలదని రుజువైంది. ఈ పరీక్ష సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, పరిశోధకులు మసాచుసెట్స్ జనరల్ బ్రిగ్హామ్ బయోబ్యాంక్ నుంచి 56 రక్త నమూనాలను పరీక్షించారు. వీటిలో 28 నమూనాలు భవిష్యత్తులో హెచ్‌పీవీ-సంబంధిత తల, మెడ క్యాన్సర్‌ వవచ్చే వ్యక్తులవి కాగా, మిగిలిన 28 నమూనాలు ఆరోగ్యవంతులవి.

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

పదేళ్ల ముందే గుర్తింపు..!

ఈ పరీక్ష సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, పరిశోధకులు మసాచుసెట్స్ జనరల్ బ్రిగ్హామ్ బయోబ్యాంక్ నుంచి 56 రక్త నమూనాలను పరీక్షించారు. వీటిలో 28 నమూనాలు భవిష్యత్తులో హెచ్‌పీవీ-సంబంధిత తల, మెడ క్యాన్సర్‌ వవచ్చే వ్యక్తులవి కాగా, మిగిలిన 28 నమూనాలు ఆరోగ్యవంతులవి.

ఈ పరీక్షలో, క్యాన్సర్ మొదలైన 28 మందిలో 22 మంది నమూనాలలో హెచ్‌పీవీ ట్యూమర్ డీఎన్‌ఏని హెచ్‌పీవీ-డీప్‌సీక్ గుర్తించింది. అయితే, ఆరోగ్యవంతుల నమూనాలలో ఏ ఒక్కటీ పాజిటివ్‌గా రాలేదు. ఈ ఫలితాలు పరీక్ష కచ్చితత్వాన్ని తెలియజేస్తున్నాయి. వ్యాధి నిర్ధారణకు దగ్గరగా ఉన్న నమూనాలలో హెచ్‌పీవీ డీఎన్‌ఏ మరింత సులభంగా గుర్తించారు. అత్యంత ముందుగా, అంటే వ్యాధి నిర్ధారణకు 7 లేదా 8 ఏళ్ల ముందు సేకరించిన నమూనాలో కూడా ఈ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ చూపింది.

మరోవైపు, పరిశోధకులు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీను ఉపయోగించి పరీక్షను మరింత మెరుగుపరిచారు. దీనివల్ల, క్యాన్సర్ ఉన్న 28 నమూనాలలో 27 కేసులను ఇది కచ్చితంగా గుర్తించగలిగింది. ఈ నమూనాలలో కొన్ని పదేళ్ల క్రితం సేకరించినవి కూడా ఉన్నాయి.

ప్రస్తుతం, పరిశోధకులు నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ ఐహెచ్) నిధులతో మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇందులో వందల నమూనాలను పరీక్షించి ఈ ఫలితాలను ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్త పరీక్ష విజయవంతమైతే, తల, మెడ క్యాన్సర్ చికిత్సలో ఒక కొత్త శకం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.