ఒక అవయవ దాత ఎంతమంది ప్రాణాలను కాపాడవచ్చు..?
సాక్షి లైఫ్ : ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన వారిని కూడా ఈ రోజున సత్కరిస్తారు. అవయవ దానం ఒక వ్యక్తికి కొత్త జీవితాన్ని ఇచ్చే గొప్ప దానంగా పరిగణిస్తారు.
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ఇది కూడా చదవండి..హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?
ప్రపంచ అవయవదాన దినోత్సవం..
ప్రతిసారీలాగే ఈ ఏడాది కూడా ఆగస్టు 13న ప్రపంచ అవయవదాన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. దీని లక్ష్యం ఏమిటంటే..? ప్రపంచవ్యాప్తంగా ఈ అవయవ దానం ప్రాముఖ్యతను అందరికీ అర్థమయ్యేలా చేయడం. అంతేకాదు అవయవ దానం ఆవశ్యకత గురించి అవగాహన పెంచడానికి కూడా ఈ రోజును జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలకు అవయవ దాన ప్రక్రియ గురించి అవగాహన కల్పిస్తారు.
చరిత్ర-ప్రాముఖ్యత..
అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఈ రోజు సరైన అవకాశం. ఇది కాకుండా, అవయవ దానం ప్రక్రియకు సంబంధించిన అపోహలను తొలగించడం లో కూడా ఈ రోజు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అవయవ దానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడి కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది. ఒక అవయవ దాత దాదాపు ఏడుగురి ప్రాణాలను కాపాడగలరని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరు అవయవదానం ప్రాముఖ్యతను తెలుసుకుని,ఇతరులకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవయవ దానానికి సంబంధించిన అపోహలను నివృత్తి చేయడం ద్వారా మరింతమందికి అవయవదానంపై అవగాహన పెంచడమేకాకుండా లక్షలాది మంది జీవితాలను కాపాడవచ్చు.
ఇది కూడా చదవండి..ఔషధాలతో పని లేకుండా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చా..?
ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
