absence seizures : ఆబ్సెన్స్‌ సీజర్స్‌లో ప్రధానంగా ఎన్నిరకాలున్నాయి..? 

షేర్ చేయండి:
absence seizures : ఆబ్సెన్స్‌ సీజర్స్‌లో ప్రధానంగా ఎన్నిరకాలున్నాయి..? 

సాక్షి లైఫ్ : అకస్మాత్తుగా ఏమిచేయాలో తెలియక పోవడాన్ని బిహేవియర్‌ అరెస్ట్‌ గా వ్యవహరిస్తారు. షాక్ లో ఉండిపోవడం ∙ముఖంలో ఎలాంటి కవళికలూ కనిపించకపోవడం, నిరంతరంగా కళ్లు ఆర్పుతూ ఉండటం, ఒంటి మీద బట్టలను లేదా ముఖాన్ని తడబాటుగా చేతి వేళ్లతో నలపడం, నోరు చప్పరించడం, మాటల్ని తప్పుగా, ముద్దగా ఉచ్చరిస్తూ ఉండటం, చేస్తున్నపనిని అకస్మాత్తుగా నిలిపివేయడం, ఆపివేయడం బయటివారు పిలుస్తున్నా జవాబివ్వకపోవడం, ఎలాంటి స్పందనలూ లేకపోవడం పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాళ్లు బయటకు పూర్తిగా నార్మల్‌గానూ కనిపించవచ్చు. మాట్లాడటం మాత్రం చాలావరకు నార్మల్‌గా ఉండిపోవచ్చు. కొందరిలో మాత్రం కొంచెం అస్పష్టత కనిపించవచ్చు. 

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?

ఈ లక్షణాలన్నీ వారు ఆటలాడుకుంటున్నప్పుడూ, టీవీ చూస్తున్నప్పుడూ లేదా కొన్నిసార్లు నిద్రలో కూడా కొనసాగు తుంటాయి. చిన్నారులు అన్యమనస్కంగా ఉండటమో లేదా ఏదో లోకంలో ఉన్నట్టు కనిపించడాన్ని తల్లిదండ్రులు గమనిస్తే వెంటనే డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాలి. 

ఎలా నిర్ధారిస్తారు..?

ఆబ్సెన్స్‌ సీజర్స్‌లో ప్రధానంగా టిపికల్‌, అటిపికల్‌ అనే రకాలు ఉంటాయి. టిపికల్‌ సీజర్స్ ని ఎమ్మారై (బ్రెయిన్‌) వంటి పరీక్షలతో నిర్ధారించవచ్చు. ఇక అటిపికల్‌ రకాల విషయంలో ఇతర నాడీ సంబంధమైన సమస్యలనూ, జీవక్రియలకు సంబంధించిన, జన్యుసంబంధమైన మరికొన్ని పరీక్షలతో పాటు మెదడు,వెన్నుపూస చుట్టూ ఉండే ద్రవంను పరీక్షించడం ద్వారా తెలుసుకుంటారు. 

చికిత్స ఎలా..?  
 
సమస్య నిర్దారణ అయిన వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. ఇందుకోసం ఫిట్స్‌ మందులు (యాంటీ సీజర్‌ మెడిసిన్స్‌) వాడాలి. వీటిని కనీసం రెండేళ్ల పాటు వాడాల్సి ఉంటుంది. అలా వాడుతూ ఉంటే వ్యాధి నుంచి కొంత ఉపశమనం లభించి, బాధితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాళ్ళ పరిస్థితిని గమనిస్తూ, దాని ప్రకారం మోతాదును క్రమంగా తగ్గిస్తూ పోవాలి. ఈ మందులు చిన్నారుల్లో... కేవలం ఫిట్స్‌ తగ్గించడం మాత్రమే కాదు, వాళ్ల జీవన నాణ్యతనూ మెరుగుపరుస్తాయి. స్కూల్లో వాళ్ల సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.

సామాజికంగా ఒంటరి కాకుండా... నలుగురితో కలిసిపోయేలా చేస్తాయి. మందుల గుణం కనిపిస్తోందా లేదా అన్న విషయాన్ని నిర్ణీత వ్యవధుల్లో ఈఈజీ తీయడం ద్వారా పరిశీలిస్తూ ఉండాలి. ఇక సహాయ చికిత్సలుగా వాళ్లకు కీటోజెనిక్‌ డైట్‌ ఇవ్వడం, వేగస్‌ నర్వ్‌ అనే నరాన్ని ప్రేరేపించడం జరుగుతుంది. దాదాపు 70 శాతం కేసుల్లో చిన్నారులు యుక్తవయసునకు వచ్చేనాటికి మంచి స్పందన కనిపిస్తుంది.  

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.