డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి ఏం చేయాలి..? 

షేర్ చేయండి:
డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి ఏం చేయాలి..? 

సాక్షి లైఫ్ : డెంగ్యూ అనేది వైరల్ ఇన్ఫెక్షన్, ఇది దోమ కాటు వల్ల వస్తుంది. డెంగ్యూ దోమలు మురికి నీటిలో వృద్ధి చెందుతాయి. డెంగ్యూ తర్వాత అత్యంత ప్రమాదకరమైనది ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గడం. ప్లేట్‌లెట్స్ ఎముక మజ్జలోని ఉండే రక్త కణాలు. ఆరోగ్యవంతమైన వ్యక్తికి 1.5 లక్షల నుంచి4 లక్షల రక్తపు ప్లేట్‌లెట్లు ఉంటాయి. కానీ డెంగ్యూ విషయంలో వాటి సంఖ్య వేగంగా పడిపోతుంది. దీని కారణంగా రోగి రోగనిరోధక శక్తి బలహీనపడ డమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా అనేక ఇతర వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది, కాబట్టి ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి పలురకాల ఆహార పదార్థాలను మీ ఆహారంలో చేర్చుకోవాలి. 

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

ప్లేట్‌లెట్ల సంఖ్య.. 


డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి, దీనిలో ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పడిపోతుంది. తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్ కారణంగా గాయాలైనా లేదా కోసుకున్నా రక్తస్రావం ఆగదు. ఇది అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తుంది. అయితే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఇందుకోసం   బొప్పాయి, దానిమ్మ, బీట్‌రూట్‌లను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడే ఆహార పదార్థాలు

బొప్పాయి.. 

బొప్పాయి ఆకులను తినడం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది. ఈ ఆకులలో అసిటోజెనిన్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది డెంగ్యూలో పడిపోయే ప్లేట్‌లెట్ల సంఖ్యను వేగంగా పెంచడానికి పనిచేస్తుంది. బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల తెల్ల రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి.


ఇది కూడా చదవండి.. ఆక్సిటోసిన్‌ పాల వల్ల కలిగే దుష్ప్రభావాలు.. 

బీట్‌రూట్.. 

డెంగ్యూ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో ముఖ్యంగా బీట్‌రూట్‌ను చేర్చుకోవాలి. బీట్‌రూట్‌లో ఐరన్ ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడానికి పనిచేస్తుంది. మీరు దీన్ని సలాడ్, సూప్ లేదా జ్యూస్ వంటి ఏరూపంలోనైనా తీసుకోవచ్చు.

 సిట్రస్ పండ్లు..  

డెంగ్యూ రోగులు ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవడానికి సిట్రస్ పండ్లను కూడా తీసుకోవాలి. పుల్లటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆరెంజ్, స్వీట్ లైమ్, నిమ్మ, ఉసిరి వంటి పండ్లను తినడం వల్ల ప్లేట్‌లెట్స్ పెరగడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.

దానిమ్మ.. 

దానిమ్మలో విటమిన్ సితో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా దానిమ్మలో ఐరన్ కూడా మంచి పరిమాణంలో ఉంటుంది. ప్లేట్‌లెట్లను పెంచడంలో ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. దానిమ్మపండు తినడమే కాకుండా దాని జ్యూస్ కూడా తాగవచ్చు.

పాలకూర.. 

పాలకూరలో విటమిన్ కె సమృద్ధిగా లభిస్తుంది. ఇది ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. విటమిన్ కె తో పాటు, పాలకూరలో ఫోలేట్ కూడా ఉంటుంది. పాలకూరను వెజిటబుల్ సూప్ లేదా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి.. పక్షవాతం రావడానికి కారణాలు..? 

 ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.