బరువు తగ్గడానికి ఉల్లిపాయలను ఎలా తినాలి..?  

షేర్ చేయండి:
బరువు తగ్గడానికి ఉల్లిపాయలను ఎలా తినాలి..?  

సాక్షి లైఫ్ : ఉల్లిపాయ మన ఆహారంలో సాధారణంగా ఉపయోగించే ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఒకటి. ఇవి రుచికి మాత్రమే కాక, శరీరానికి కావాల్సిన అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. బరువు తగ్గడంలో కూడా ఉల్లిపాయలు కీలక పాత్ర పోషిస్తాయి ఉల్లిపాయలు. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ,మెటబాలిజం పెంపొందించే ఉల్లిపాయలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించే వారికి ఇవి ఒక మంచి ఎంపిక. బరువు తగ్గడానికి ఉల్లిపాయలను ఎలా తినాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

పచ్చి ఉల్లిపాయ సలాడ్..

పచ్చి ఉల్లిపాయ సలాడ్ ఉల్లిపాయలను సలాడ్ రూపంలో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇతర కూరగాయలతో కలిపి కూడా తినవచ్చు.

ఉల్లిపాయ రసం, నిమ్మకాయ-తేనె.. 
 
ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ, తేనెతో ఉల్లిపాయ రసం తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.

ఉల్లిపాయ సూప్.. 

ఫైబర్ అధికంగా ఉండే ఉల్లిపాయ సూప్ తక్కువ కేలరీలు కలిగిఉండడమే కాకుండా మంచి పోషకాలతో నిండి ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. అదనపు కేలరీలు తీసుకోకుండా సహాయపడుతుంది.

 స్మూతీ రూపంలో..

ఉల్లిపాయను పాలకూర, దోసకాయ, పుదీనాతో కలిపి తయారుచేసిన గ్రీన్ స్మూతీ శరీరానికి పోషణను అందించడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

 
ఉల్లిపాయ టీ.. 

ఉల్లిపాయ, అల్లం, దాల్చిన చెక్కతో తయారుచేసిన టీ శరీరాన్ని డీటాక్స్ చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

 ఉల్లిపాయ ఊరగాయ.. 

తేలికపాటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన ఉల్లిపాయ ఊరగాయ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఆహార పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది.

కాల్చిన ఉల్లిపాయలు.. 

కాల్చిన ఉల్లిపాయలను సలాడ్‌లో లేదా సైడ్ డిష్‌గా జోడించడం ద్వారా తక్కువ కేలరీల ఎంపిక,ఆహార రుచిని కూడా పెంచుతుంది.

శాండ్‌విచ్‌లు లేదా రోల్స్‌లో పచ్చి ఉల్లిపాయలు.. 

శాండ్‌విచ్‌లు లేదా రోల్స్‌లో పచ్చి ఉల్లిపాయను జోడించడం వల్ల ఆకలి తగ్గుతుంది, తక్కువ కేలరీలతో తగినంత పోషణ లభిస్తుంది.

ఉల్లిపాయ, దోసకాయ సలాడ్.. 

కరిగే ఫైబర్ అధికంగా ఉండే దోసకాయతో ఉల్లిపాయ సలాడ్ తీసుకుంటే  శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది.

పప్పు,కూరగాయలలో ఉల్లిపాయ.. 

పప్పుధాన్యాలు, కూరగాయలలో ఉల్లిపాయను జోడించడం ద్వారా ఆహారంలో ఫైబర్ శాతం పెరుగుతుంది, ఇది జీవక్రియను మెరుగు పరుస్తుంది. ఈ విధంగా మీ ఆహారంలో ఉల్లిపాయను చేర్చుకోవడం ద్వారా, మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.