ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉంటే..? ఎలా నిర్వహించాలి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉంటే..? తప్పనిసరిగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉంటే, రోగిని ఆసుపత్రిలో చేర్చాలి. అక్కడ తరచుగా రక్త పరీక్షల ద్వారా ప్లేట్‌లెట్ కౌంట్‌ని పర్యవేక్షిస్తారు వైద్యులు.ప్లేట్‌లెట్ కౌంట్ 40 వేలకంటే తక్కువగా ఉంటే, రోగికి ప్లేట్‌లెట్ మార్పిడి అవసరం కావచ్చు. ఒకవేళ 20వేల కంటే ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గితే రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు. అటువంటి సందర్భాలలో ఆలస్యం చేస్తే రోగి పరిస్థితిని మరింతగా దిగజార్చవచ్చు.

ప్లేట్‌లెట్స్ పెరగాలంటే ఏం చేయాలి..?

- రోగికి బొప్పాయి, దానిమ్మ, కివి, బీట్‌రూట్, ఆకు కూరలు, తిప్పతీగ ఆకు , కొబ్బరి నీరు, గుమ్మడికాయ వంటి ప్లేట్‌లెట్‌లను పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.

అంతే కాకుండా విటమిన్ బి12, విటమిన్ సి, ఫోలేట్, ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినిపించాలి.

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

- అరటిపండు, బచ్చలికూర, బ్రకోలీ ,మొలకలు వంటి విటమిన్ కె సమృద్ధిగా ఉన్న ఆహారాలను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.

- డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి.

డెంగ్యూలో, ప్లేట్‌లెట్‌లను తరచుగా పర్యవేక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గితే  రోగి ప్రాణాలకే ప్రమాదం. అందువల్ల, ప్లేట్‌లెట్స్ తగ్గకుండా రోగి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..  చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.