ఉల్లిపాయ రసం రెగ్యులర్ గా తాగడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా..?

సాక్షి లైఫ్ : మనం నిత్యం వంటల్లో ఉపయోగించే వాటిల్లో ఉల్లిపాయ ముఖ్యమైనది. వంటకాన్ని రుచిగా మార్చడంలోనే కాకుండా, అనేక ఆరోగ్యకరమైన పోషకాలు కలిగి ఉంది. రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి రక్తంలో చక్కెరను నియంత్రించడం వరకు, ఉల్లిపాయలు అనేక విధాలుగా సహాయపడతాయి. కాబట్టి రోజూ ఉల్లిపాయ రసం తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఇది కూడా చదవండి.. శరీరాన్ని సజావుగా నడపడంలో రక్తం పాత్ర ఏమిటి..? 

 

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

 

 ఇది కూడా చదవండి.. గుడ్డు పచ్చసొన అంటే పసుపు భాగం తినకూడదా..?

జీవక్రియను మెరుగుపరచడంలో..

ఉల్లిపాయలో విటమిన్ "సి" , "బి" వంటి విటమిన్లు, పొటాషియం,మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి ఉల్లిపాయ రసం తాగడం వల్ల ఈ పోషకాలు అందుతాయి. విటమిన్ "సి" ఉన్న ఉల్లిపాయ రసం తాగడం కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి సహాయపడుతాయి. అంతేకాదు కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి కూడా. ఉల్లిలో ఉండే సల్ఫర్, ఇతర యాంటీఆక్సిడెంట్లు కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

రక్తం గడ్డకట్టడాన్ని నివారించడం..

ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించడం, రక్తం గడ్డకట్టడాన్ని నివారించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఉల్లిపాయలలో ఉండే కొన్ని సమ్మేళనాలు యాంటీ డయాబెటిక్ ప్రభావాలను కలిగి ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి. ఇవి  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతాయి. అంతే కాదు, ఉల్లిపాయలు ఫైబర్ కంటెంట్ కు గొప్ప మూలం. ఇది జీర్ణక్రియకు సహాయపడడం ద్వారా పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


ఇది కూడా చదవండి.. ప్రొస్టేట్ గ్రంథిలో వాపు వచ్చినప్పుడు.. ఏం జరుగుతుంది..?   

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diabetes hair-loss hair-fall-problem immune-system onion-juice health-benefits-of-onion-juice amazing-health-benefits-of-onion-juice

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com