చెడు కొలెస్ట్రాల్ ను అంతమొందించే పండు..  

షేర్ చేయండి:
చెడు కొలెస్ట్రాల్ ను అంతమొందించే పండు..  

సాక్షి లైఫ్ : మల్బరీ పండులో ఆంథోసైనిన్స్ పుష్కలంగా ఉంటాయి. అవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఇందులో ఫైటోన్యూట్రియెంట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. మల్బరీ పండు క్యాన్సర్ నియంత్రణలో కూడా ఉపయోగపడుతుంది. మల్బరీలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ఐరన్  లోపం ఉన్నవాళ్లకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. రక్తహీనత వల్ల వచ్చే అలసట, తలతిరగడం వంటివి నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మల్బరీ పండు.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..ఈ వ్యాధుల నుంచి దూరంగా ఉండాలంటే మల్బరీ పండ్లు తినాలి.. 

ఒత్తిడిని తగ్గించడంలో.. 

కంటి కణాలపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో మల్బరీ ఫ్రూట్  అద్భుతమైనది. ఇది సెల్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. కంటి చూపును రక్షిస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో కూడా ఇది మంచిపనితీరు కనబరుస్తుంది. మెదడు ఆరోగ్యానికి మల్బరీ పండు తినాలని పరిశోధనలు సైతం సూచిస్తున్నాయి.

ఎముకల ఆరోగ్యానికి.. 

ఎముకల ఆరోగ్యానికి ఇది అద్భుతమైనది. ఇందులోని కాల్షియం, ఐరన్ ,విటమిన్ "కె " వంటివి ఎముక కణజాల పెరుగుదలకు, ఎముకల పటిష్టతకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని విటమిన్ "సి" శరీరంలోని గాయాలను మాన్పడానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

బరువు.. 

 శరీర బరువును పెంచే పండ్లు చాలా ఉన్నాయి. కానీ అలాంటి భయం లేకుండా తినదగినపండ్లలో మల్బరీ పండు ఒకటి. ఈ పండులో ఉండే ఫైబర్స్ ఆకలిని తగ్గించడానికి సహాయపడుతాయి. తద్వారా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. 

కొలెస్ట్రాల్ ను నియంత్రించడమే కాకుండా.. 

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది మల్బరీ ఫ్రూట్. కొలెస్ట్రాల్ ను నియంత్రించడమే కాకుండా, దానిలో ఉండే  ఫైబర్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు కూడా గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలన్నింటికీ ఇది అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తుంది.

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?  

ఇది కూడా చదవండి.. గుండె ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన కాల్షియాన్ని ఎలా తొల‌గిస్తారు ..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.