గుండె ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన కాల్షియాన్ని ఎలా తొల‌గిస్తారు ..?

షేర్ చేయండి:
గుండె ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన కాల్షియాన్ని ఎలా తొల‌గిస్తారు ..?

సాక్షి లైఫ్ : గుండె క‌వాటాల్లో గ‌ట్టిగా పేరుకుపోయిన కాల్షియంను తొల‌గించాలంటే అంత సుల‌భం కాదు. గ‌తంలో దీనికి బెలూన్ ఆధారిత చికిత్స‌లు కొన్ని ఉండేవి. కానీ ఇప్పుడు అత్యాధునికంగా రోటాప్రో రోటాబ్లేష‌న్ అనే స‌రికొత్త చికిత్స ఒక‌టి వ‌చ్చింది. 73 ఏళ్ల వ్యక్తికి ఉన్న స‌మ‌స్య‌ను కిమ్స్ హాస్పిటల్ కర్నూలుకి చెందిన సీనియ‌ర్ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ కార్డియాల‌జిస్టు డాక్ట‌ర్ నాగేంద్ర ప్రసాద్ తోట న‌యం చేశారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆయన వెల్లడించారు. 

 ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..జికా వైరస్ సింటమ్స్ ఎలా ఉంటాయి..?

“73 ఏళ్ల వృద్ధునికి చాలా తీవ్ర‌స్థాయిలో గుండెపోటు వ‌చ్చింది. దాంతో ఆస్ప‌త్రికి తీసుకురాగా ప‌రీక్షించి చూస్తే అతనికి లోప‌ల కాల్షియం చాలా ఎక్కువ‌స్థాయిలో పేరుకుపోయింది. అతని వ‌య‌సు ఎక్కువ కావ‌డం, ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా ఉండ‌టంతో సాధార‌ణ యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ చేయ‌డం కుద‌ర‌దు. దాంతో అతనికి అత్యాధునిక ప‌ద్ధ‌తి అయిన రోటాప్రో రోటాబ్లేష‌న్ చికిత్స చేశామని ఆయన తెలిపారు.

 ఇది స‌రికొత్త టెక్నాల‌జీ. ఇంత‌కుముందు కూడా రోటాబ్లేట‌ర్లు ఉన్నా, వాటిని కాలితో పెడ‌ల్ తొక్క‌డం ద్వారా ప‌నిచేయించాల్సి వ‌చ్చేది. రోటాప్రో సిస్టంను చేత్తోనే ప‌నిచేయించ‌వ‌చ్చు. దీనికి ముందు వ‌జ్రంతో చేసిన టిప్ ఉంటుంది. దానివ‌ల్ల అత్యంత సంక్లిష్ట‌మైన వాటిని కూడా చాలా సుల‌భంగా చెక్కుతూ అత్యంత క‌చ్చిత‌త్వంతో పూడిక‌ను తొల‌గిస్తుంది. దానివ‌ల్ల రోగికి ఆరోగ్య‌ప‌ర‌మైన భ‌ద్ర‌త మ‌రింత పెరుగుతుంది. 

గ‌తంలో ఉన్న క‌టింగ్ బెలూన్, స్కోరింగ్ బెలూన్, అల్ట్రా హైప్రెష‌ర్ బెలూన్‌, లిథోట్రిప్సీ, అబ్లేటివ్ టెక్నిక్స్ కంటే ఇది చాలా మెరుగైన‌ది. కొత్త రోటాప్రో సిస్టం వ‌ల్ల ప్రొసీజ‌ర్ చేసే స‌మ‌యం, ఫ్లూరోస్కొపీ స‌మ‌యం, కాంట్రాస్ట్ ప‌రిమాణం, రేడియేష‌న్ డోస్ అన్నీ తగ్గుతాయి. వీట‌న్నింటి వ‌ల్ల కూడా రోగికి మెరుగైన ఫ‌లితాలు ఉంటాయి” అని ఆయన పేర్కొన్నారు. 

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.