బరువు నియంత్రణలో గుమ్మడికాయ గింజల పాత్ర..?    

షేర్ చేయండి:
బరువు నియంత్రణలో గుమ్మడికాయ గింజల పాత్ర..?    

సాక్షి లైఫ్ : గుమ్మడికాయ గింజలు (Pumpkin Seeds) ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించే పోషకవిలువలు ఉన్నాయి. ఈ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా వివిధ అనారోగ్యసమస్యలను నివారించవచ్చు. గుమ్మడికాయ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు (విటమిన్ ఏ , ఇ, బి, కె , సి) ఖనిజాలు (మ్యాగ్నీషియం, జింక్, ఇనుము, ఫాస్ఫరస్, కాపర్) అధికంగా కలిగి ఉంటాయి.

 

ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?

 

 గుండె ఆరోగ్యానికి మేలు.. 

ఈ గింజలు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కలిగి ఉండి, రక్తపోటు నియంత్రణ, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం,గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. 
 

 మెదడు ఆరోగ్యానికి.. 

గుమ్మడికాయ గింజలలో ఆంథోసియానిన్లు, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు ఉండి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో మూడ్ నియంత్రణలో సహాయపడతాయి.

 నిద్రకు..  

ఈ గింజల్లో ట్రిప్టోఫాన్‌ అనే ఆమినో ఆమ్లం ఉండి, సిరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది, తద్వారా నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. 
 

 రోగనిరోధక శక్తి పెంపు.. 

గుమ్మడికాయ గింజలలో జింక్ అధికంగా ఉండి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, శరీరాన్ని సంక్రమణల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

 జీర్ణక్రియకు మేలు.. 

ఈ గింజల్లో అధిక ఫైబర్ ఉండి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

 బరువు నియంత్రణ.. 

గుమ్మడికాయ గింజలు ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండి, పొట్ట నిండిన భావన కలిగించి, అధిక ఆహారం తీసుకోవడం నివారించడంలో సహాయ పడతాయి.

 చర్మ ఆరోగ్యానికి.. 

విటమిన్ "ఇ", జింక్ వంటి పోషకాలు గుమ్మడికాయ గింజల్లో ఉండి, చర్మం సంరక్షణలో, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి.

గుమ్మడికాయ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ గింజలను రోస్టు చేసి, సలాడ్‌లు, సూప్‌లు, స్మూతీలు మొదలైన వాటిలో తీసుకోవచ్చు. అధిక కేలరీలు కలిగి ఉంటాయి, కాబట్టి పరిమితంగా తీసుకోవడం మంచిది.

 

ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.