దోమల వల్ల వచ్చే ప్రధాన వ్యాధులు, వాటి లక్షణాలు..? 

షేర్ చేయండి:
దోమల వల్ల వచ్చే ప్రధాన వ్యాధులు, వాటి లక్షణాలు..? 

సాక్షి లైఫ్ : వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు, దోమల బెడద పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో దోమలు ప్రాణాంతక వ్యాధులను వ్యాపింపచేస్తాయి. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు దోమకాటు ద్వారా వ్యాపించి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండటం, వాటి లక్షణాలను గుర్తించడం, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ కథనంలో, దోమల వల్ల వచ్చే ప్రధాన వ్యాధులు, వాటి లక్షణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి..ఊరగాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..కాలేయానికి ఎలాంటి ఫుడ్స్ స్నేహితులు, ఎలాంటి ఫుడ్స్ శత్రువులు..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో దోమల బెడద పెరగడానికి కారణాలు ఏమిటి..? 

 

డెంగ్యూ: ఇది ఏడిస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాపిస్తుంది. అధిక జ్వరం, తీవ్రమైన కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, దద్దుర్లు, వికారం, వాంతులు వంటివి ప్రధాన లక్షణాలు. ప్లేట్‌లెట్స్ తగ్గడం డెంగ్యూలో అత్యంత ప్రమాదకరం.

మలేరియా: ఆడ ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల ప్లాస్మోడియం అనే పరాన్నజీవి రక్తంలోకి ప్రవేశించి మలేరియాకు కారణమవుతుంది. చలి, వణుకు, అధిక జ్వరం, తీవ్రమైన చెమట, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చికున్‌గున్యా: ఏడిస్ ఈజిప్టి, ఏడిస్ ఆల్బోపిక్టస్ దోమలు ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. తీవ్రమైన కీళ్ల నొప్పులు, జ్వరం దీని ప్రధాన లక్షణాలు. కీళ్ల నొప్పులు దీర్ఘకాలం పాటు వేధించవచ్చు. మెదడువాపు వ్యాధి (ఎన్సెఫలైటిస్): కొన్ని రకాల దోమలు ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తాయి, ఇది మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.