Anti Ageing : వృద్ధాప్య ఛాయల్ని దూరం చేసే 'మల్టీ విటమిన్'.. తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు..!

షేర్ చేయండి:
Anti Ageing : వృద్ధాప్య ఛాయల్ని దూరం చేసే 'మల్టీ విటమిన్'.. తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు..!

సాక్షి లైఫ్ : వయసు పెరుగుతున్నా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని ఎవరికి ఉండదు? అయితే జీవక్రియల్లో వచ్చే మార్పుల వల్ల శరీర అంతర్గత వ్యవస్థల పనితీరు నెమ్మదించడం సహజం. ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో వచ్చే 50 శాతం వ్యాధులకు ఈ వృద్ధాప్య ఛాయలే ప్రధాన కారణమని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రతిరోజూ తీసుకునే 'మల్టీ విటమిన్' మాత్రలు ముసలితనాన్ని ఆలస్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తాజా 'కాస్మో' (COSMO) అధ్యయనం వెల్లడించింది.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

ఏమిటీ పరిశోధన..?

అమెరికాకు చెందిన పరిశోధకులు సుమారు 1,000 మంది 70 ఏళ్ల వృద్ధులపై రెండేళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిని వివిధ బృందాలుగా విభజించి.. కొందరికి రోజువారీ మల్టీ విటమిన్ మాత్రలు, మరికొందరికి కోకో ఎక్స్‌ట్రాక్ట్, ఇంకొందరికి ఔషధ గుణాలు లేని మాత్రలు ఇచ్చి పర్యవేక్షించారు.

ఎపిజెనెటిక్ క్లాక్.. వేగం తగ్గింది..!

మన శరీరంలోని జన్యువుల పనితీరులో వచ్చే మార్పులను 'ఎపిజెనెటిక్ ఏజింగ్' అంటారు. ఈ మార్పులను కొలిచేందుకు పరిశోధకులు ప్రత్యేకమైన 'ఎపిజెనెటిక్ క్లాక్స్'ను విశ్లేషించారు.

మల్టీ విటమిన్ ప్రభావం.. 

ప్రతిరోజూ మల్టీ విటమిన్ తీసుకున్న వారిలో వృద్ధాప్య ఛాయలు పెరిగే వేగం గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. అధ్యయనం ప్రారంభంలోనే వయసు కంటే ఎక్కువ వృద్ధాప్య లక్షణాలు ఉన్నవారిలో, ఈ మల్టీ విటమిన్ల వల్ల మరింత మెరుగైన ఫలితాలు కనిపించాయి. అయితే, వృద్ధాప్యాన్ని నియంత్రించడంలో కోకో ఎక్స్‌ట్రాక్ట్ వల్ల ఎలాంటి ప్రత్యేక ప్రభావం కనిపించలేదని పరిశోధకులు తేల్చారు.

అందుబాటులో ఉండే పరిష్కారం.. 

మల్టీ విటమిన్ మాత్రలు సురక్షితమైనవి, తక్కువ ధరకే లభించేవి కావడంతో.. వృద్ధులు వీటిని వాడటం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కేవలం వృద్ధుల్లోనే కాకుండా, తక్కువ వయసు ఉన్నవారిలో కూడా ఇవి ఇలాగే పనిచేస్తాయా? అనే అంశంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.